లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్ కి ఊహించని షాక్ తగిలిందట. లియో సినిమాని మల్టీప్లెక్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదని సమాచారం. అయితే ఇది లియో హిందీ వర్షన్ కి మాత్రమే వర్తిస్తుంది. లియో సినిమా హిందీ వెర్షన్ నార్త్ లోని ఏ మల్టీప్లెక్స్ రిలీజ్ చేయడానికి రెడీగా లేవట. ఎందుకంటే నార్త్ బెల్ట్ లో ఉన్న మల్టీప్లెక్స్ లలో ఉన్న రూల్ ప్రకారం… ఒక సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత మినిమమ్ ఎనిమిది వారాల గ్యాప్ అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలట.
అలా కాకుండా నెలకో, ఆరు వారాలకో ఓటీటీలోకి ఇచ్చేస్తాం అంటే మాత్రం మల్టీప్లెక్స్ లు ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావు. లియో సినిమా కూడా నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ చేసుకుందట. ఈ కారణంగానే నార్త్ లో లియో హిందీ రిలీజ్ కి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇది చాలదన్నట్లు లియో రిలీజ్ అవుతున్న రోజే నార్త్ లో అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన గణపత్ సినిమా విడుదల కానుంది. ఒకవేళ మల్టీప్లెక్స్ లో రిలీజ్ దొరికినా కూడా లియో మూవీకి గణపత్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం గ్యారెంటీ. అయినా అసలు కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేసి, ఆడియన్స్ కి గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు చేసుకుంటూ నెల రోజుల్లో ఓటీటీలోకి ఎందుకు రిలీజ్ చేస్తన్నారో ఈ మేకర్స్.