‘అందాల రాక్షసి’తో కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మూడు పదుల ఈ ముద్దమందారం టాలీవుడ్ లో గడిచిన తొమ్మిదేళ్ళలో పలువురు యువ కథానాయకుల సరసన నటించి, తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఈ యేడాది కూడా సందీప్ కిషన్ సరసన ‘ఎ1 ఎక్స్ ప్రెస్’, కార్తికేయ తో ‘చావు కబురు చల్లగా’ చిత్రాలలో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు.
Read also : ఏపీ టికెట్ ధరలు : హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్
డిసెంబర్ 15 లావణ్య త్రిపాఠి పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై చెర్రీ, హేమలత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ టైటిల్ ను లావణ్య త్రిపాఠి బర్త్ డే న ప్రకటించడం ఓ విశేషం కాగా, దానికి ‘హ్యాపీ బర్త్ డే’ అనే పేరు పెట్టడం మరో విశేషం. నరేశ్ అగస్త్య, ‘వెన్నెల’ కిశోర్, సత్య, గుండు సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాలభైరవ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.