మెగా హీరోతో లావణ్య త్రిపాఠీ పెళ్లి.. డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో పుకార్లకు కొదువ లేదు. హీరో హీరోయిన్లు కొద్దిగా చనువుగా మాట్లాడితే చాలు వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చేస్తాయి. కొంతమంది తారలు అలాంటి పుకార్లను పట్టించుకోరు.. కానీ మరికొంతమంది తారలు అలాంటి గాసిప్స్ కి స్ట్రాంగ్ రిప్లెలు ఇస్తారు. ఇక తాజగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కూడా అదే పని చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా నిన్న బర్త్ డే జరుపుకున్న వరుణ్, బెంగుళూరు వెళ్లి లావణ్యకు డైమెండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినట్లు కథనాలు పుట్టుకొచ్చేశాయి.
ఇక ఈ వార్తలపై మెగా హీరో స్పందించలేదు కానీ లావణ్య మాత్రం ఇన్ డైరెక్ట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సంక్రాంతి నుంచి తానూ డెహ్రడూన్ లోని తన సొంత ఇంట్లో ఉన్నానని, కుటుంబ సభ్యులతో ఛిల్ల్ అవుతున్నట్లు ఫోటోలను పోస్ట్ చేసింది. దీంతో నిన్న వరుణ్ బెంగుళూరు వెళ్ళింది లావణ్య కోసమే అనే వార్తలకు చెక్ పడ్డట్లు అయ్యింది. ఇకపోతే వీరిద్దరూ కలిసి ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని, అందుకే వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లికి లావణ్య స్పెషల్ గెస్ట్ గా వెళ్లిందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా లావణ్య క్లారిటీతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది. ఇక ఇటీవల నాగబాబు, వరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. వరుణ్ కోసం మంచి అమ్మాయిని వెతుకుతున్నాం అని చెప్పడంతో వరుణ్ కి ఏ లవ్ స్టోరీ లేదని తెలుస్తోంది.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!