Bigg Boss Telugu 7: చూస్తూ చూస్తూ ఉండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై వారం అయిపోయింది. మొదటి నుంచి కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టడంతో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ గొడవల వలన ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. ఇక ఈ వారం మొత్తం కొద్దిగా ఫన్.. ఇంకొద్దిగా విభేదాలతో నడిచింది. ఇక మొదటి రోజూ నుంచే బిగ్ బాస్ ఎలిమినేషన్ మొదలుపెట్టాడు. చిన్న చిన్న కారణాలే అయినా కూడా అందరు తమకు నచ్చనివారిని ఎలిమినేట్ చేశారు. మొదటి ఎలిమినేషన్ లో మొత్తం 8 మంది ఎలిమినేటి అయ్యారు. ఇక ఆ ఎనిమిది మందికి చెక్క బాక్స్ లు ఇచ్చి .. అందులో పువ్వులు వస్తే సేఫ్.. అస్థిపంజరం వస్తే అన్ సేఫ్ అని నాగ్ చెప్పాడు. అయితే 8 మందిలో 6 గురుకి పువ్వులు వచ్చాయి. చివరగా.. ప్రిన్స్ యావన్ , కిరణ్ రాథోడ్ మిగిలారు.
Ketika Sharma : స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ…
ఇక ఈరోజు ఎపిసోడ్ లో నాగ్ వీరిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయననున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం కిరణ్.. మొదటి ఎలిమినేషన్ లో బలి అయ్యిందని తెలుస్తోంది. ఆమెనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చే కంటెస్టెంట్ అని చెప్పుకొస్తున్నారు. కిరణ్ కు తెలుగు రావడం లేదని, మిగతావారు మాట్లాడే భాషను అర్ధం చేసుకోలేకపోతుందని ఆమెను నామినేట్ చేశారు. ఇక కంటెస్టెంట్స్ తో ఏకీభవించిన ప్రేక్షకులు సైతం .. ఆమె వచ్చినదగ్గరనుంచి యాక్టివ్ గా కనిపించినా.. లాంగ్వేజ్ ను అర్ధం చేసుకోలేకపోతుందని తక్కువ ఓట్లు వేసి ఆమెను బయటకు పంపించారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.