Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యిన విషయం విదితమే. హై ఫీవర్ మరియు జలుబుతో బాధపడుతున్న ఆయన నిన్న సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. కమల్ కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, దాంతో పాటు ఆయన జ్వరంతో కూడా బాధపడుతున్నారని తెలుస్తోంది.. కమల్ ను పరీక్షించిన వైద్యులు ఇంకొద్దిసేపటిలో అధికారికంగా మీడియాకు బులిటెన్ రిలీజ్ చేసి ఆయనను డిశ్చార్చ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పక్క దారి పట్టించడానికి పలువురు పూనుకున్నారు. సెలబ్రిటీ హెల్త్ లో ఏదైనా చిన్న మార్పు కనిపించినా కొంతమంది యూట్యూబ్ ఛానెల్స్ తమ వ్యూస్ కోసం ఏవేవో థంబ్ నెయిల్స్ పెట్టి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఇటీవల హీరో విక్రమ్ కు కూడా ఇదే జరిగింది. చిన్న సమస్యతో ఆయన హాస్పిటల్ లో చేరితే గుండెపోటు వచ్చిందని, విక్రమ్ పరిస్థితి విషమంగా ఉందని రాసుకొచ్చారు. ఇంకొన్ని ఛానెల్స్ అయితే విక్రమ్ ఫొటోకు దండవేసి మరీ ఆయన చనిపోయాడని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కమల్ విషయానికొస్తే.. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయినా.. కమల్ ఆరోగ్యం విషమం అంటూ థంబ్ నెయిల్స్ పెడుతూ అభిమానులకు భయాన్ని పుట్టిస్తున్నారు.బుద్దుందా.. కమల్ డిశ్చార్జ్ కూడా కాబోతున్నాడు.. కానీ మీరు మాత్రం ఇలా అంటూ అభిమానులు తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఈ థంబ్ నెయిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి పుకార్లు ఇంకా స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే కమల్.. ఏదైనా పోస్ట్ కానీ, మీడియా ముందుకు వచ్చి తాను బాగున్నాను అని చెప్పడం కానీ చేస్తే వీటికి చెక్ పెట్టొచ్చని నెటిజన్లు అంటున్నారు. త్వరలోనే కమల్ ఆ పని చేయనున్నట్లు తమిళ తంబీలు గుసగుసలాడుతున్నారు.