నువ్వు నేను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనిత. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చిసిన బ్యూటీ అక్కడ అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. నాగిని సీరియల్ తో మంచి పేరు తెచ్చుకొని భారీ పారితోషికంనే తీసుకుంటుంది. ఇకపోతే అనిత 2014 లో వ్యాపారవేత్త రోహిత్ ను పెళ్ళాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక బాబుకు తల్లి అయిన అమిత్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ కొడుకుతో ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇంట్లో ఉంటూ కూడా అనిత కొన్ని ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రమోషన్స్ చేస్తోంది.
ఇక తాజాగా అమ్మడు కండోమ్ కు ప్రమోషన్స్ చేసింది. భర్తతో కలిసి కండోమ్ ను ఎలా వాడాలి.. ఆ కండోమ్ యొక్క పని తీరు గురించి కూడా ఆడవారికి వివరించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ యాడ్ కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఏదిఏమైనా అవకాశాలు రాకపోయినా ప్రస్తుతం స్టార్లు ఈ యాడ్స్ చేసుకొని కోట్లు సంపాదించేస్తున్నారు. మరి ముందు ముందు అమ్మడు సినిమాల్లో నటిస్తుందో.. లేక ఈ పనే బావుందని ఇంట్లో భర్తతో కలిసి యాడ్స్ చేస్తుందో చూడాలి.