Akkineni Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విషయం పక్కన పెడితే నాగార్జున తీరుపై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. నాగ చైతన్య, అఖిల్ ను హీరోగా నిలబెట్టడానికి నాగ్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు.. ఇప్పుడిప్పుడే ఈ అక్కినేని హీరోలు కెరీర్ లో సెట్ అవుతున్నారు. ఇక కొడుకులను ఎంకరేజ్ చేయడంలో నాగ్ ఎప్పుడు ముందు ఉంటాడు. వారి సినిమాలకు సంబంధించిన విషయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అభిమానులకు ఉత్సాహం తెప్పిస్తూ ఉంటాడు. అయితే చైతూ థాంక్యూ మూవీకి నాగ్ దూరంగా ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేవరకు కూడా నాగ్ ఈ సినిమా గురించిన ఒక ట్వీట్ కూడా వేయకపోవడం విశేషం. దీంతో అక్కినేని అభిమానులు నాగ్ కు ఏమైంది.. ? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే సినిమా పరాజయం పాలవుతుందని నాగ్ కు ముందే తెలిసి ఉంటుంది.. అందుకే ఈ సినిమా గురించి నాగ్ మాట్లాడలేదు అని అంటున్నారు. ఇటీవల ప్రై రిలీజ్ ఈవెంట్ కు కూడా నాగ్ రాకపోవడం అక్కినేని అభిమానులను నిరాశకు గురిచేసింది. మరి దీని వెనుక ఉన్న గుట్టు ఏంటి అనేది నాగార్జున చెపితే కానీ తెలియదు.ఘోస్ట్ తో పాటు నాగ్ బ్రహ్మాస్త్రలో కూడా నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.