విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలియనివారు టాలీవుడ్ లో ఉండరు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ మొత్తానికి సుపరిచితుడైన విజయ్.. లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12 న విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత విజయ్- శివ నిర్వాణ కాంబోలో ఖుషీ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాలో విజ్జయి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట.. ఒక రిచ్ కుర్రాడిగా విలన్ తరహా పాత్రలో విజయ్ ను చూపించబోతున్నాడట శివ.
ఇక అతని జీవితంలోకి సమంత రావడంతో పాజిటివ్ గా మారి అక్కడి నుంచి వారి మధ్య ఒక లవ్ స్టోరీ నడుస్తుందని, ఆ లవ్ స్టోరీ హృదయానికి హత్తుకునేలా ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే విజయ్ రిస్క్ చేస్తున్నట్లే అని అంటున్నారు. విజయ్ కు విలన్ రోల్ కొత్తేమి కాదు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాల్లో విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఇక అర్జున్ రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో యారోగెంట్ గా కనిపించి మెప్పించాడు. మరి ఈ సినిమాలో కూడా దాన్ని ఫాలో చేస్తాడా..? నిన్ను కోరి, మజిలీ చిత్రాలలానే ఈ సినిమా కూడా ఉండనుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.