టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. నాగ చైతన్య తో విడాకుల తరువాత జోరు పెంచిన ఈ బ్యూటీ భాషతో సంబంధం లేకుండా సినిమాలను లైన్లో పెట్టి క్షణమ్ కూడా తీరిక లేకుండా వర్క్ లో మునిగి తేలుతోంది. ఇక విడాకుల తరువాత సామ్ మీడియా ముందుకు వచ్చింది లేదు. తన విడాకుల విషయం దగ్గరనుంచి ట్రోల్స్, కేసు అంటూ అన్ని సోషల్ మీడియా ద్వారే కానిచ్చేసింది తప్ప మీడియా ముందు వచ్చి మాట్లాడింది లేదు. ఏదైనా ఇంటర్వ్యూలో విడాకుల ప్రస్తావన వచ్చినా అర్ధం కాకుండా లైఫ్ గురించి, లవ్ గురించి చెప్పిందే తప్ప క్లారిటీ ఇచ్చింది లేదు. ఇక ఇప్పుడు అమ్మడు మీడియా నుంచి తప్పించుకొనే ప్రసక్తి లేదు. ఎందుకంటే సామ్ నటిస్తున్న కోలీవుడ్ మూవీ `కాదువాకుల రెండు కాదల్`రిలీజ్ కి సిద్దమవుతుంది.. తెలుగులో `కణ్మని రాంబో ఖతీజా`పేరుతో రిలీ అవుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సామ్ పాల్గొనాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లో ఖచ్చితంగా మీడియా విడాకుల ప్రస్తావన తీసుకొస్తారు.. ఇదే పరిస్థితి ఇటీవల బంగ్గారాజు ప్రమోషన్స్ లో నాగ చైతన్య ఎదుర్కొన్నాడు. అన్ని చోట్ల ఈ విషయాన్ని అవైడ్ చేసుకుంటూ వచ్చినా ఒకటి రెండు ఇంటర్వ్యూలో విడాకుల గురించి స్పందించాడు. సామ్ తో సినిమా చేయడం తనకు కంఫర్ట్ అని, విడాకులు పర్సనల్ ఛాయిస్ అని, ఇద్దరం స్నేహితులుగా ఉంటామని చెప్పుకొచ్చాడు. మరి సామ్ మీడియా ముందు విడాకులపై నోరు విప్పుతుందా..? అన్న ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విడాకులు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇండైరెక్ట్ గా విడాకులపై సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ లు పెడుతూ చర్చనీయాంశంగా మారిన సామ్ త్వరలో మీడియా ముందు అక్కినేని కుటుంబం గురించి కానీ, చై గురించి కానీ నోరు విప్పుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి సామ్ విడాకుల విషయమై ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తుందా..క్లారిటీ ఇస్తుందా? అనేది చూడాలి.