అక్కినేని నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మధుడు.. టాలీవుడ్ కింగ్.. 62 ఏళ్ల వయస్సులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలామంది హీరోలను నాగార్జున ఆదర్శమని చెప్పాలి. ఎప్పుడు పేస్ లో ఛార్మింగ్, గ్లో తో కనిపించే నాగ్ ఫేస్ కళతప్పింది. నాగ్ కొడుకు నాగ చైతన్య, సమంత విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ మీడియాకు దూరంగా ఉన్న విషయం విదితమే. ఇక ఆ తరువాత తమ సినిమాల ప్రమోషన్స్ లో తప్ప బయట కనిపించని నాగ్.. తాజాగా జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఇక అక్కడ నాగ్ ను చుసిన వారందరు షాక్ అయ్యారు. ముఖమంతా పీక్కుపోయి, వయస్సు మీదపడినట్లు కనిపించారు. దీంతో అర్రే నాగార్జునకు ఏమైంది..? అని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్ లో నాగ్ యాక్టివ్ గా లేకుండా ముభావంగా కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.
వేడుకలో సినిమా గురించి కూడా రెండు ముక్కలు మాట్లాడి ఓకే అనిపించారు. ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఎన్నో విషయాలు మాట్లాడే నాగ్ ఇలా ముభావంగా మాట్లాడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే నాగ్ ఇలా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగ్.. ఘోస్ట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడని, దాని వలన అలసిపోయి ముఖం డల్ గా కనిపిస్తుందని కొందరు అంటుండగా.. మరికొందరు నాగ్ గత కొన్నిరోజుల నుంచి కొడుకుల భవిష్యత్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడని, అందుకే ఇలా మారిపోయాడని చెప్తున్నారు. అయితే ఏది ఏమైనా నాగార్జున లో మునుపటి చార్మింగ్ కానీ, గ్లో కానీ లేదని, ఇలా ఉంటే ఆయన ఒరిజినల్ వయస్సు బయటపడుతుందని అభిమానులు అంటున్నారు. మరి కారణం ఏదైనా నాగ్ మళ్లీ మునుపటి రూపంలోకి తిరిగి వచ్చి హుషారుగా వరుస సినిమాలను లైన్లో పెట్టి సీనియర్ హీరోలకు గట్టి పోటీ ఇస్తాడేమో చూడాలి.