Lal Singh Chadda Trailer: అమ్మ చెప్పింది.. లైఫ్ అంటే పానీ పూరీ లాంటిదని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lal Singh Chadda: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ చిత్రంతో అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అమీర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో లాల్ సింగ్ చడ్డా అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను చిరంజీవి రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “అమ్మ చెప్తూ ఉండేది.. మనందరి తలరాత ముందే రాసి ఉంటుందని, రాసినట్లే జరుగుతోందని.. అసలు నాకు తెలియనిది ఏంటంటే ఎవరు రాశారు.. ఎంత రాశారు.. ఎందుకు రాశారో తెలియదు” అని అమీర్ వాయిస్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అయ్యింది. చిన్నతనంలో నడవలేని లాల్ అనే కుర్రాడు తల్లి ఇచ్చిన దైర్యంతో రన్నర్ గా, మేజర్ గా మారతాడు. బుద్ధి మాంద్యం ఉన్న లాల్ జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి..? అతనికి పరిచయమైన స్నేహితులు ఎవరు..? జీవితంలో తన తల్లి చెప్పిన మాటలు నిజమయ్యాయా..? అనేది సినిమా కథగా తెలుస్తోంది.
చిరంజీవి చెప్పినట్లే సినిమా ఎంతో ఎమోషనల్ గా ఉండనున్నట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. చిన్నతనం నుంచి నడవలేని ఒక కుర్రాడిగా, బుద్ధి మాంద్యం ఉన్న యువకుడిగా అమీర్ నటన అద్భుతంగా ఉందని చెప్పాలి. కానీ, ధైర్యంతో అతడు సైన్యంలో చేరడం, అవార్డును కూడా గెలుచుకోవడం చూపించి మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అని రుజువు చేయగలడు అనే సారాంశాన్ని అందిస్తున్నట్లు కనిపిస్తోంది. లాల్ భార్యగా కరీనా, స్నేహితుడిగా నాగ చైతన్య కనిపించారు. ఇక చివర్లో “అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది.. లైఫ్ అంటే పాణి పూరీ లాంటిదని.. కడుపు నిండినట్లు ఉంటుంది కానీ మనసు మాత్రం నిండదని” అని అమీర్ ఎంతో అమాయకంగా చెప్పడం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకొంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!