రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే సమయంలో ముందుగా ప్రకటించినట్టు ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ మాత్రం ఆగస్ట్ 11న రావడం లేదు. ఆ చిత్రాన్ని దర్శక నిర్మాతలు కాస్తంత వెనక్కి పంపుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తెలిపాడు. ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానందువల్ల తమ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు ఆమీర్ ఖాన్ చెప్పాడు. అయితే ఆ రోజున రావాల్సిన ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీని ఓంరౌత్ వాయిదా వేస్తున్నాడని, అందుకు అతనికి, నిర్మాత భూషణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నాడు. సో… ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఆగస్ట్ 11న రావడం లేదన్నది ఖాయం.
విశేషం ఏమంటే… ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నాగచైతన్య కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాను ఆమీర్ పాన్ ఇండియా మూవీగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ విడుదల చేయబోతున్నాడు. సో… తెలుగు వాళ్ళు ప్రభాస్ సినిమా డేట్ కు నాగ చైతన్య మూవీ వస్తోందని అనుకోవచ్చు!