ఇప్పటి వరకు ఇండియన్ యానిమేషన్ ప్రపంచంలో సంచలనాన్ని సృష్టించిన మహావతార్ నరసింహ తర్వాత పలు కొత్త యానిమేషన్ ప్రాజెక్ట్‌లు ప్రకటించబడ్డాయి. వాటిలో ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి రాబోతున్న “కురుక్షేత్ర” సిరీస్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సిరీస్ పాన్ ఇండియా భాషలతో పాటు ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌కూ చేరేలా రూపొందించబడింది. విడుదలైనప్పట్లో ఈ ప్రాజెక్ట్‌కు మంచి రెస్పాన్స్ అందింది. మొత్తం 18 ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో మొదట 9 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతా ఎపిసోడ్స్ ఎప్పుడు విడుదల అవుతాయనే క్లుస్ ఇప్పటి వరకు తెలియలేదు. అయితే, నెట్‌ఫ్లిక్స్ తాజాగా మిగతా 9 ఎపిసోడ్స్ ఈ అక్టోబర్ 24 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయని ఖరారు చేసింది. ప్రస్తుతానికి, రిలీజ్ అయిన 9 ఎపిసోడ్స్‌కి ప్రేక్షకుల మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మిగతా ఎపిసోడ్స్ ఏవిధమైన విశేషాలను అందిస్తాయో, ప్రత్యేక యుద్ధ సన్నివేశాలు మరియు డ్రామాటిక్ మోమెంట్స్ ఎలా ఉంటాయో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.