Kubera: కుబేర స్టోరీ ఇదే.. అదిరిపోయింది కదా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kubera: కోలీవుడ్ స్టార్ హారో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నిన్న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ ను, ధనుష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ ఒక బిచ్చగాడిగా కనిపించాడు. ఒక గోడపై శివునికి ఆహారం పెడుతున్న పార్వతి ఫోటోను చూపిస్తూ.. నడిరోడ్డుపై చిరిగిన బట్టలు, మాసిన గడ్డంతో ఒక బిచ్చగాడిలా ధనుష్ కనిపించాడు. ఇక ఈ పోస్టర్ తరువాత ఇదొక రియల్ కథను ఇన్స్పిరేషన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ చూసాకా.. కుబేర కథ ఇదే అని కొంతమంది చెప్పుకొస్తున్నారు.
కుబేరుడు గురించి అందరికి తెల్సిందే. కుబేరుడు ముందు జన్మలో గుణనిధిగా పుట్టాడు. అతని కథనే శేఖర్ కమ్ముల ఆధారంగా చేసుకున్నాడంట. గుణనిధి.. వ్యసనాలకు అలవాటు పడి, త్వరగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు, దోపిడీలు చేసి డబ్బు సంపాదించేవాడు. అయితే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధి తండ్రికి ఈ విషయం తెలియడంతో ఎక్కడ తనను చంపేస్తాడేమో అని భయపడి గుణనిధి.. ఒక శివాలయంలో దాక్కుంటాడు. అక్కడ తినడానికి తిండి లేక అలమటిస్తాడు. ఇక గుడిలో జాగారం చేసిన భక్తులకు పుణ్యం దక్కే పని చేసాక కాలుజారీ నంది తల తగిలి చనిపోతాడు. ఇక ఆ పుణ్యమే.. తరువాతి జన్మలో అతడిని కుబేరుడుగా పుట్టించినట్లు సూత మహర్షి తెలిపాడు.
Also Read
ఇక ఇదే కథను ఇప్పటికాలానికి అనుగుణంగా శేఖర్ చూపించనున్నాడు. ధనుష్.. ఒక మాఫియా డాన్ గా డబ్బు కోసం ఎన్నో తప్పులు చేస్తాడట. అతని కోసం వెతికే ఈడీ ఆఫీసర్ గా నాగ్ కనిపించనున్నాడట. ఇలా తనను చంపడానికి వెతికే పోలీసుల నుంచు తప్పించుకోవడానికి ధనుష్.. ఒక ఊరికి వచ్చి.. ఇలా బిచ్చగాడిగా మారతాడని, ఆ తరువాత అతనికి శాపవిమోచనం ఎలా అయ్యింది.. ? ధనుష్ మారతాడా.. ? మళ్లీ కుబేరుడుగా అవుతాడా..? అనేది కుబేర కథ అని చెప్తున్నారు. వినడానికి ఇదంతా కొత్త కథలానే అనిపిస్తుంది. మరి శేఖర్ కమ్ముల ఇలాంటి సినిమాను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?