Kubera: కోలీవుడ్ స్టార్ హారో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నిన్న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టైటిల్ ను, ధనుష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ధనుష్ ఒక బిచ్చగాడిగా కనిపించాడు.