అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని చూశానంటూ దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటున్నారు మరార్. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ‘క్షీర సాగర మథనం’ ట్రైలర్ ను శరత్ మరార్ విడుదల చేశారు.
Read Also : స్టాండప్ రాహుల్ : “అలా ఇలా…” లిరికల్ వీడియో సాంగ్
మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ గా… ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడుగా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.