Kriti Sanon:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే టాలీవుడ్ మొత్తం లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే డార్లింగ్ పేరే వినిపిస్తోంది. ఎప్పటినుంచో అనుష్క, ప్రభాస్ మధ్య ప్రేమాయణం నడుస్తుందని, త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, అందులో ఎటువంటి నిజంలేదని, తాము ఇద్దరం స్నేహితులమే అని ప్రభాస్- అనుష్క చెప్పుకొచ్చారు. ఇక అనుష్కను పక్కన పెడితే.. కొన్ని రోజుల నుంచి ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆదిపురుష్ సినిమాలో ఈ జంట కలిసి నటించారు. అప్పటినుంచి వీరిమధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఈ పుకార్లపై ఇప్పటివరకు ప్రభాస్ కానీ, కృతి కానీ నోరువిప్పింది లేదు. ఇక తాజాగా ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన తోడేలు చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కృతి మాట్లాడుతూ.. ” ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటే.. ఆ పొగను ఖండించకుండా కృతి ఇంకా అగ్గిరాజేయడంతో నిజంగానే ఈ జంట మధ్య ఏదో జరుగుతోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.