Krithi Sanon : ఈ మధ్య హీరోయిన్లు, హీరోలు వరుసగా ఆస్తులు కొనేస్తున్నారు. అందులోనూ బాలీవుడ్ భామలు అయితే లగ్జరీ ఫ్లాట్లను కొనేసుకుని అందులోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ ఇదే లిస్టులో చేరింది. ఆదిపురుష్ లో సీత పాత్రలో మెరిసిన కృతిసనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది ఈ బ్యూటీ. టాలీవుడ్ సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. అందుకే బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనేసింది.
Read Also : Mrunal Thakur : తెలివి తక్కువగా మాట్లాడా.. మృణాల్ క్షమాపణలు
ముంబయిలోనే ఖరీదైన ఏరియా అంటే బాంద్రా వెస్ట్. ఇక్కడ ధనవంతులు, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే ఉంటారు. ఈ ఏరియాలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనేసింది కృతిసనన్. పాలి హిల్ ప్రాంతంలో డ్యూప్లెక్స్ పెంట్‌హౌస్‌ను కొనేసింది ఈ పొడుగుకాళ్ల సుందరి. ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.84.16 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రీసెంట్ గానే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. ఆమె గతంలోనే ముంబైలోని ఓ ఏరియాలో మంచి ఫ్లాట్ ఉంది. ఇప్పుడు ఈ లగ్జరీ ఫ్లాట్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
Read Also : Anirudh Ravichander-Coolie: అనిరుధ్.. సౌండ్ లేదేంటి?
