Anirudh Ravichander-Coolie: అనిరుధ్.. సౌండ్ లేదేంటి?
- అనిరుధ్ రవిచంద్రన్ ఉంటేనే సినిమా
- బీజీఎం విషయంలో అనిరుధ్ సూపర్
- కూలీలో యంత్రం సౌండ్ లేదేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కొందరు హీరోలు, దర్శక, నిర్మాతలు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ఉంటేనే సినిమా చేస్తామనే పరిస్థితిలో ఉన్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ తనదైన మ్యూజిక్‌తో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లడమే అందుకు కారణం. ముఖ్యంగా బీజీఎం విషయంలో థియేటర్ నుంచి బయటికకొచ్చాక కూడా అనిరుధ్‌నే గుర్తుకు వచ్చేలా ఉంటుంది. విక్రమ్, జైలర్ సినిమాలను అనిరుధ్ లేకుండా అస్సలు ఊహించుకోలేము. అందుకే ఆయనకు తమిళ్‌లోనే కాకుండా తెలుగులోను ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఒక్కో సినిమా కోట్లకు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఇటీవల తెలుగులో దేవర, కింగ్డమ్ సినిమాలకు పని చేశాడు. అయితే అనిరుధ్ ఏ సినిమా చేసిన సరే ప్రత్యేకంగా ఆయన బీజీఎం గురించి మాట్లాడుకోవాల్సిందే. కానీ లేటెస్ట్‌గా వచ్చిన ‘కూలీ’ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో అనిరుధ్ గురించి పెద్దగా సౌండ్ వినిపించడం లేదు. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు అనిరుధ్ తనదైన స్టైల్లో అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కానీ విక్రమ్, జైలర్ సినిమాలతో పోలిస్తే మాత్రం కూలీపై తన ఇంపాక్ట్ కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కూలీ రిలీజ్‌కు ముందు మోనిక సాంగ్‌తో అనిరుధ్ రవిచంద్రన్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఎక్కడ చూసినా, విన్నా మోనిక సాంగే హల్చల్ చేసింది. దాంతో విక్రమ్, జైలర్ సినిమాలకు మించి మ్యూజిక్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుధ్ పెద్దగా సౌండ్ చేయలేకపోయాడనే చెప్పాలి. అసలు సూపర్ స్టార్‌కు ఇచ్చే ఎలివేషన్ పీక్స్‌లో ఉంటుంది. జైలర్‌లో హుకుం అంటూ.. థియేటర్‌ను షేక్ చేశాడు. కానీ కూలీకి అలాంటిదేమి లేదన్నట్టుగానే అనిపించింది. అనిరుధ్ ఇంకాస్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే బాగుండేది అని ఫాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..