Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆతర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కృతికి ఆ తర్వాత వరుసగ ఫ్లాప్స్ పడ్డాయి. ఇక రీసెంట్ గ శర్వానంద్ తో కలిసి నటించిన మనమే మూవీ కూడా మిక్సడ్ టాక్ రావడంతో ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. అయితే తాజాగా ఆమెకు ఓక స్టార్ హీరో సరసన ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
తమిళ దర్శకుడు సెల్వమని సెల్వరాజ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని దుల్కర్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి “కాంత” అనే టైటిల్ ఖరారు చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో దుల్కర్‌కి జోడీగా కృతిని ఎంపిక చేసినట్లు సమాచారం. టాలీవుడ్ హీరో రానాకు చెందిన ‘స్పిరిట్ మీడియా’ బ్యానర్, దుల్కర్ ‘వేఫారర్ ఫిల్మ్స్’ రెండూ కలిసి ఈ ‘కాంత’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. అలానే ఈ మూవీలో రానా కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దుల్కర్ ‘సార్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా “లక్కీ భాస్కర్” అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయినా వెంటనే కాంత సినిమా మొదలపెట్టబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‍లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం తెలుగు, మలయాళంతో పాటు హిందీ, తమిళంలోనూ విడుదలయ్యే అవకాశం ఉంది.