Krithi Shetty Creating a new hot image: కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ మంగళూరు భామ ఆ తర్వాత నటించిన సినిమాలు మాత్రం ఆమెకు పెద్దగా పేరును తీసుకురాలేదు. అయితే ఎప్పుడు పద్దతిగా కనిపించే ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ అందాలతో కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండడం అందునా తాజాగా బ్యాక్ అందాలతో పిచ్చెక్కించేలా ఫోజులిచ్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నిజానికి కృతి శెట్టి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నట్లు కనిపిస్తోంది. హోమ్లీ గర్ల్ గా ముద్ర వేయించుకున్న ఆమె ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకుని ఒక కొత్త ఇమేజ్ కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆమె తాజా ఫోటోషూట్ చిత్రాలు ఆమెను పూర్తిగా భిన్నమైన ఒక హాట్ అవతార్‌లో చూపించాయి. ఆమె హాట్ కొత్త ఫోటోలు వైరల్‌గా మారాయి, వేల సంఖ్యలో లైక్‌లు అలాగే కామెంట్‌లు కూడా ఆమె ఫోటోలకు వస్తున్నాయి. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో కృతి శెట్టి ఇటీవల వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ 30వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అది వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది. అయితే ఆమె చేతిలో ఓ తమిళ సినిమా ఉంది, అయితే ఆమెకు మరిన్ని ఆఫర్లు కావాలని అందుకు ఆమె ఇలా రెచ్చిపోతుందని అంటున్నారు.