Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Anil Ravipudi Exclusive Interview For Bhagavanth Kesari Movie

Anil Ravipudi: బ్రో ఐ డోంట్ కేర్ టైటిల్ అందుకే వద్దనుకున్నాం.. బాలయ్య నన్ను గురువు గారు అని పిలుస్తారు!

Published Date :October 14, 2023 , 6:27 pm
By Bhargav Chaganti
Anil Ravipudi: బ్రో ఐ డోంట్ కేర్ టైటిల్ అందుకే వద్దనుకున్నాం.. బాలయ్య నన్ను గురువు గారు అని పిలుస్తారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anil Ravipudi Exclusive Interview for Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’.అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది సినిమా యూనిట్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేయగా ఇప్పుడు తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో ‘భగవంత్ కేసరి’ విశేషాలని పంచుకున్నారు.

‘భగవంత్ కేసరి’ అనిల్ రావిపూడి మార్క్ కి భిన్నంగా కనిపిస్తుంది ఏంటి?
నేను ఆరు సినిమాలు పూర్తి చేశా, అంటే.. ఒక ఓవర్(క్రికెట్) అయిపోయింది. ఇది మరో ఓవర్, మరో ఇన్నింగ్స్ అనుకుంటున్నా (నవ్వుతూ). ఎమోషనల్ డ్రామా సీన్స్ ముందు సినిమాల్లో కూడా బాగా చేశా, అయితే ఎంటర్ టైన్ మెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అవి నెక్స్ట్ లెవల్ కి చేయలేదనే ఫీలింగ్ ఉంది. కంప్లీట్ హానెస్ట్ ఇంటెన్స్ డ్రామా తో ఓ సినిమా చేయాలనిపించి ట్రై చేస్తే దానికి బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. శ్రీలీల సహా మంచి స్టార్ కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, కథ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ‘భగవంత్ కేసరి’ చాలా ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుందని అనుకుంటున్నా.

సరిలేరు నీకెవ్వరు లో ఆర్మీ నేపథ్యం ఉంది.. ఇందులో కూడా ఆర్మీ కనెక్ట్ ఉంది, అనుకునే చేశారా?
‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్ బాబు గారితో ఒక ఆర్మీ కథ చేయాలని ఫిక్స్ అయి చేసింది. కానీ ‘భగవంత్ కేసరి’ లో చాలా గోల్స్ వున్నాయి, ఆర్మీకి పంపడంతో పాటు అమ్మాయిని స్ట్రాంగ్ ఎలా చేయాలనే క్యారెక్టరైజేషన్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయికి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఎలా వీక్ అయ్యింది? ఎలా స్ట్రాంగ్ చేయాలి ? దాని బ్యాక్ డ్రాప్ గోల్ ఆర్మీని తీసుకున్నాం ‘అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి’ అనే అండర్ లైన్డ్ బ్యూటీఫుల్ కంటెంట్ వుంది. ఇప్పుడు అమ్మాయిలు ఆర్మీలో చేరుతున్నారు బోర్డర్ ఫైట్స్ కోసం కాదు కానీ అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో పని చేస్తున్నారు. భవిష్యత్ లో వార్ లో భాగమవుతారేమో? ఎందుకంటే ఏపీలో అమ్మాయిలు ఆర్మీకి సిద్ధమవుతున్న డాక్యుమెంటరీలు కూడా నేను చూశా, ఎవరూ టచ్ చేయని పాయింట్ తో కొంచెం స్ఫూర్తిని ఇచ్చేలా కూడా ఉంటుంది. దానికి నేను అనుకున్న కథకి ఈ నేపథ్యం ఇంకా ఉంటుందనిపించి ఆర్మీ బ్యాక్ డ్రాప్ యాడ్ చేయడం జరిగింది.

‘భగవంత్ కేసరి’ కథ, పాత్ర బాలకృష్ణ గారికి చెప్పినపుడు ఏమన్నారు?
బాలకృష్ణ కొత్త ఎలిమెంట్ ఉన్న కథని యాక్సెప్ట్ చేస్తారు, ఆయనకు ఒక మంచి కథ చెప్పాలి, ప్రయోగం చేయాలని అనుకుంటే ఆయన ముందు ఉంటారు. ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఘన విజయాలు సాధించారు బాలయ్య. ‘అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి’అనే కాన్సెప్ట్ ఆయన చాలా బాగా నచ్చింది, చాలా బలంగా నమ్మారు. ఒక స్టార్ హీరోగా వుండి శ్రీ లీల లాంటి అప్ కమింగ్, ఫుల్ ఫాం లో ఉన్న హీరోయిన్ కు ఫాదర్ గా చేయడానికి ఒప్పుకోవడం, ఆయన గట్స్ కి నిజంగా హ్యాట్సాఫ్, ముందు ఆయన కథని బలంగా నమ్మారు. నాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చారు. ఓ నటుడిగా షూటింగ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ ,కంఫర్ట్ .. అవుట్ పుట్ చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది.

తెలంగాణ యాస ఆలోచన మీదేనా ?
అవును, తెలంగాణ యాసలో ఒక ముక్కుసూటి తనం ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం దానికి దగ్గరగా ఉంటుంది, ఇది ఆయన మీద చేస్తే బాగా వర్క్ అవుట్ అవుతుందని బలంగా నమ్మా, అది బాగా వర్క్ అవుట్ అయ్యింది కూడా. ఇందులో చాలా డైలాగ్స్ ఆయన నేచర్ కి దగ్గరగా ఉంటాయి, డైలాగ్స్ థియేటర్స్ లో పేలుతాయి.

ఈ చిత్రానికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ని పరిశీలించారట ?
మొదట అనుకున్నాం కానీ బాలయ్య బాబు టైటిల్ అంటే ఒక ఫోర్స్ ఉండాలి. బ్రో ఐ డోంట్ కేర్ కంటే ఏదైనా ఒక పేరు ఉంటే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలా పేర్లు వునప్పుడు ఎక్కువ రోజులు ప్రేక్షకులతో సినిమా ట్రావెల్ అవుతుందని భగవంత్ కేసరి అని పెట్టాం, దీనికి నేలకొండ అనే పేరు చేర్చి ఎన్బీకే గా కాయిన్ చేయడంతో మరింత ఆకర్షణ వచ్చింది.

మీ సినిమాల్లో అమ్మాయిల పాత్రలు కొంచెం లౌడ్ గా ఉంటాయి కదా ,. ఇందులో ఎలా ఉంటుంది ?
భగవంత్ కేసరి లో ఎంటర్ టైన్మెంట్ చాలా సెటిల్ గా ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా చాలా సహజంగా చేశాం. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా చాలా రియలిస్టిక్ గా చేశాం, అలాగే నా మార్క్ ఫన్ టింజ్ సినిమాలో అక్కడక్కడ టచ్ అవుతూనే ఉంటుంది, సహజంగా ప్రయత్నిస్తూనే వినోదాన్ని రాబట్టాం. ఇందులో కూడా చాలా మంచి వన్ లైనర్స్ వున్నాయి, ట్రైలర్ లో బ్రో ఐ డోంట్ కేర్, హుష్ సప్పుడు జేయక్ .. తో పాటు ఇంకా కొన్ని క్యాచి లైనర్స్ వున్నాయి,, సినిమా విడుదలైన తర్వాత ఇంకా పాపులర్ అవుతాయి.

బాలకృష్ణ గారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు ?
నన్ను బ్రో అని పిలుస్తారు, ఐతే షూటింగ్ స్పాట్ లో గురువు గారు అని పిలుస్తారు నిజానికి అంత పెద్ద లెజెండరీ యాక్టర్ గురువు గారు అని పిలవడంతో చాలా షాక్ అయ్యా. దర్శకుడి స్థానానికి ఆయన ఇచ్చే గౌరవం అది, ఇక ఆయన ఫన్ మోడ్ లో వుంటే ఆయన్ని ఆపలేం… అన్ స్టాపబుల్ అంతే.

బాలకృష్ణ ఇందులో రెండు క్యారెక్టర్స్ లో కనిపిస్తారా ?
లేదండీ బాలకృష్ణది ఒకటే పాత్ర. ఐతే క్యారెక్టర్ లో వేరియేషన్ వుంటాయి, ముందు జైలు నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఆరంభం నుంచి భగవంత్ కేసరి పాత్ర ఒక పాపతో జర్నీ చేసి, ఆ పాపని లక్ష్యం వైపు ఎలా తీసుకెళ్లారు ? అదే సమయంలో తనకు ఉన్న పగని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ? అనేది కథ.

అర్జున్ రామ్ పాల్ పాత్ర గురించి ?
ఇందులో విలన్ ది చాలా పెద్ద రోల్, బాలకృష్ణ గారికి ఎదురుగా నిలబడే పాత్ర, అర్జున్ రాం పాల్ గారిని ఓ శాంతి ఓం లో చూసినప్పటినుంచి ఇష్టం. ఆయన వాయిస్, ప్రజన్స్ చాలా బాగుంటుంది. తెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది అని ఆయన కలవడం జరిగింది, ఆయన కూడా చాలా ఎక్సయిట్ అయ్యారు. అయితే ఆయన ముందే భాష విషయంలో ఒక నిర్ణయంతో ఉండి ప్రామ్టింగ్ చేయను నేర్చుకొని చెప్తా అన్నారు, ముందే డైలాగ్స్ ఇవ్వమని నేర్చుకుని చెప్పారు, ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు.

అర్జున్ రామ్ పాల్ లాంటి నటుడితో స్టిక్ పట్టించడానికి కారణం ?
అది మీరు సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది, చాలా సర్ప్రైజ్ వుంది, ముఖ్యంగా క్లైమాక్స్ లో తెలుస్తుంది.

మీ తర్వాత సినిమాలో కూడా తమన్ ని కంటిన్యూ చేస్తారా ?
సాయి కార్తీక్ తో మూడు, దేవితో మూడు సినిమాలు చేశా, ఇప్పుడు తమన్ కూడా జర్నీ చాలా బాగుంది. ఈ సినిమాకి తమన్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. తనతో జర్నీ కొనసాగించాలనే భావిస్తా, ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయి. మూడు కూడా సిట్యువేషనల్ సాంగ్స్ కాగా మరో సాంగ్ తీసి పక్కన పెట్టాం, అది దసరాకి యాడ్ చేస్తాం.

ఇందులో వెపన్ చాలా కొత్తగా వుంది కదా ?
ఈ సినిమాలో బాలకృష్ణ గారు వెపన్ ని క్యారీ చేయరు. అక్కడున్న పరిస్థితులు, లొకేషన్ నుంచి ఒక వెపన్ ని తీసుకుంటారు. అది చాలా కొత్తగా ఆసక్తిగా వుంటుంది. ప్రతి సీన్ లో ఆయన ఒక వెపన్ అందుకుంటాడు. అది ఎలా అందుకుంటారో చాలా ఇంట్రస్టింగా వుంటుంది. ఇందులో ప్రతి సీక్వెన్స్ కి ఒక వెపన్ వుంటుంది. అది చాలా నేచురల్ గా వుంటుంది.

ఇందులో మొత్తం ఎనిమిది యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని విన్నాం?
లేదండీ. మొత్తం మూడు ఫైట్లు, ఓపెనింగ్ ,ఇంటర్వెల్ క్లైమాక్స్, ఐతే మిగతావన్నీ ఫైట్స్ లా కనిపిస్తాయి కానీ ఫైట్స్ కాదు. అవన్నీ యాక్షన్ బ్లాక్స్, దాని నుంచి కూడా యాక్షన్ వినోదం పుడుతుంది.

శ్రీ లీలని చాలా కష్టపెట్టించినట్లు వున్నారు.. ఫైట్స్ కూడా చేయించారా ?
దీని గురించి ఇప్పుడు మాట్లాడటం కంటే విడుదలైన తర్వాత మాట్లాడాలి, అదంతా తెరపై చూడాల్సిందే. శ్రీలీల బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. తనకి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, డ్యాన్సుల ఇరగదీస్తుంది. భగవంత్ కేసరిలో బాలకృష్ణ, శ్రీ లీల మధ్య ఎమోషనల్ ఇంటెన్స్ డ్రామా ప్రేక్షకులకు చాలా కాలం గుర్తుండిపోతుంది, శ్రీలీలకి ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం అవుతుంది.

కాజల్ గారి పాత్ర ఎలా ఉంటుంది ?
బాలకృష్ణ కాజల్ మధ్య ఎలాంటి వినోదం ఉంటుంది అనే దానికి ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తాం, కాజల్ ది చాలా కీలకమైన పాత్ర. రెగ్యులర్ హీరోయిన్ తరహా కాదు, కథకు కనెక్ట్ అయి వుంటుంది.

దీనికి పార్ట్ 2 చేసే ఆలోచన ఉందా ?
ఇప్పటివరకు ఆలోచన లేదు. సినిమాని ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాని బట్టి పార్ట్ 2 గురించి ఆలోచిస్తాం.

ఇకపై యాక్షన్ సినిమాలు తీస్తారా ?
ఒక దర్శకుడిగా అన్ని సినిమాలు చేయాలని నా కోరిక. కె విశ్వనాథ్ గారు లాంటి సినిమా చేయాలని ఉంటుంది. అలాగే కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని వుంది. ఈ జర్నీలో ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ ప్రకారం డిఫరెంట్ జోనర్స్ ని టచ్ చేస్తూ వెళ్ళాలనేది నా ప్రయత్నం.

షైన్ స్క్రీన్స్ నిర్మాతలు గురించి ?
హరీష్, సాహు 2016 లో పరిచయం అయ్యారు, అప్పుడే అడ్వాన్స్ ఇచ్చారు. దాదాపు ఐదేళ్ల దాకా వెయిట్ చేశారు. సరైన సమయంలో సరైన ప్రాజెక్ట్ వచ్చిందనే చెప్పాలి. దిల్ రాజు గారు, శిరీష్ గారి తర్వాత అంత చనువు వున్న నిర్మాతలు వీరు, మున్ముందు వారితో సినిమాలు చేయాలని వుంది.

ఒక ఆడియన్ గా భగవంత్ కేసరి గురించి ఏం చెప్తారు ?
కొత్త సినిమా, మంచి సినిమా, సినిమా చూసిన పది నిమిషాల తర్వాత ఇది వేరే ప్రపంచం అని ప్రేక్షకులకు అర్థమైపోతుంది. బాలకృష్ణ ముందు సినిమాల రిఫరెన్స్ లు ఇందులో ఉండవు, నేచురల్ గా వెళుతుంది. భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరికి భగవంత్ కేసరి నచ్చుతుంది ముఖ్యంగా మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా నచ్చుతుంది.

కొత్త సినిమాల గురించి?
ప్రస్తుతం నా దృష్టి మొత్తం భగవంత్ కేసరి విడుదల పైనే వుంది. విడుదలైన తర్వాత మరో సినిమా గురించి ఆలోచిస్తా, ఐతే ఏది చేసినా డిఫరెంట్ గా ఛాలెంజింగ్ గా చేయాలని వుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Anil Ravipudi comments
  • Anil Ravipudi interview
  • Anil Ravipudi latest interview
  • Anil Ravipudi on bhagavanth kesari

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

  • Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions