Krithi Shetty Birthday : ఉరకలేస్తోన్న ‘ఉప్పెన’ నాయిక కృతి శెట్టి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెనలో సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి ఉస్సూరుమంటూ కూలుతూ కనిపిస్తాయి. ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి కెరీర్ కూడా ఆ చిత్ర ఘనవిజయంతో ఒక్కసారిగా ఉద్ధృతంగా ఎగసింది. తెలుగు చిత్రసీమలోని ప్రముఖ హీరోలతో వరుసగా నటించే అవకాశాలు చేజిక్కించుకుంటూ సాగుతోంది కృతి శెట్టి. తొలి సినిమా తరువాత ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాల ఫలితాలు ఉస్సూరుమనిపిస్తున్నాయి. అదలా ఉంచి, కృతి శెట్టిని తమ చిత్రాలలో నాయికగా నటింప చేసేందుకు నిర్మాతలు, దర్శకులు ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.
కృతి శెట్టి 2003 సెప్టెంబర్ 21న ముంబైలో జన్మించింది. కన్నడ సీమ నుండి ముంబైలో స్థిరపడిన కుటుంబం వారిది. మాతృభాష తులు. అయితే హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ కృతి శెట్టికి మంచి పట్టుంది. చదువుకొనే రోజుల నుంచీ అందరిలోకి ప్రత్యేకంగా కనిపించే ప్రయత్నం చేస్తూ వచ్చింది కృతి. సైకాలజీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే కృతి కొన్ని యాడ్ మూవీస్ లో నటించింది. హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ‘సూపర్ 30’ సినిమాలో ఓ చిన్న పాత్రలో తెరపై తొలిసారి తళుక్కుమంది కృతి. అదే సమయంలో ‘ఉప్పెన’ దర్శకుడు తన చిత్రంలో నాయిక కోసం అన్వేషిస్తున్నారు. తన హీరోయిన్ కు కావలసిన అన్ని లక్షణాలు కృతిలో కనిపించడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’లో ఆమెను నాయికగా ఎంచుకున్నారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఉప్పెన’లోని వైవిధ్యమైన కథ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ సినిమా సాధించిన విజయంతో కృతికి తెలుగునాట అవకాశాలు మొదలయ్యాయి. తెలుగు భాషలోనూ మాట్లాడేందుకు కృషి చేస్తోంది కృతి.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
‘ఉప్పెన’ కాగానే నాని హీరోగా తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ’లో ఓ నాయికగా నటించింది కృతి. తరువాత ‘బంగార్రాజు’లో నాగచైతన్య సరసన చిందేసి కనువిందు చేసింది. రామ్ హీరోగా రూపొందిన ‘ద వారియర్’ ద్విభాషా చిత్రంలోనూ కృతి హీరోయిన్ గా నటించింది. నితిన్ సరసన ‘మాచెర్ల నియోజకవర్గం’లో కనిపించింది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ లో డాక్టర్ అలేఖ్య, అఖిలగా ద్విపాత్రాభినయం చేసింది కృతి. ఇలా తక్కువ సమయంలోనే నాలుగు చిత్రాలలో నాయికగా నటించేసింది. కానీ, తొలి సినిమా స్థాయి సక్సెస్ మళ్ళీ ఆమె దరికి చేరలేదు. ప్రస్తుతం రెండు చిత్రాలలో నటిస్తోంది కృతి. అందులో ఒకటి బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘వనంగాన్’ కాగా, మరోటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం. నాగచైతన్య, కృతి శెట్టి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆమె పుట్టినరోజునే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోవడం విశేషం! రాబోయే సినిమాలతోనైనా మరో బిగ్ హిట్ ను కృతి తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!