Krithi Shetty: మోడరన్ లుక్ లో బేబమ్మ క్యూట్ అండ్ హాట్ గా ఉందే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన సినిమాతో సూపర్బ్ డెబ్యూ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ యూత్ క్రష్ లిస్టులో చేరిపోయింది. బెబమ్మ పాత్రలో కృతి శెట్టి అంత బాగా నటిచింది. మొదటి సినిమాలోనే విజయ్ సేతుపతి లాంటి నటుడి ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంత ఈజీ కాదు కానీ కృతి శెట్టి మాత్రం చాలా బాగా నటించి మెప్పించింది. అందం, అభినయమా రెండూ ఉండడంతో కృతి శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. అనుకున్నట్లుగానే కృతి శెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమాలని సైన్ చేసి టాప్ హీరోయిన్స్ కేటగిరికి చేరువయ్యింది. హ్యాట్రిక్స్ అందుకున్న తర్వాత కృతి శెట్టికి ఇక తెలుగులో తిరుగులేదు, ఆమె టాప్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్న వాళ్లకి ఊహించని షాక్ తగిలింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే దగ్గర నుంచి సరైన హిట్ సినిమా లేక కెరీర్ ని కష్టాల్లో పడేసుకునే వరకు వచ్చింది కృతి శెట్టి.
మలయాళం డెబ్యూకి రెడీ అవుతున్న కృతి, తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ అక్కడ కూడా ఆశించిన రేంజ్ హిట్ పడలేదు. సూర్య సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. దీంతో కృతి శెట్టి మళ్లీ తెలుగు వైపు అడుగులు వేస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి. #Sharwa35 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని శ్రీ రామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి కృతి శెట్టికి బర్త్ విషెష్ చెప్తూ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈరోజు 11:07 నిమిషాలకి కృతి బర్త్ డే స్పెషల్ గిఫ్ట్ బయటకి రానుంది అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక ఫోటోని రిలీజ్ చేసారు. ఇందులో కృతి చాలా క్యూట్ గా మోడరన్ లుక్ లో కనిపించింది. మరి బేబమ్మ బర్త్ డేకి ఎలాంటి గిఫ్ట్ బయటకి వస్తుందో చూడాలి.
Also Read
Wishing Our Incredibly Talented & Ever Gorgeous @IamKrithiShetty a very happy birthday 🎉
A Beautiful Surprise awaits you @ 11:07 Am😍
Stay Tuned to https://t.co/FHXnrWACs0 @ImSharwanand @SriramAdittya @vishwaprasadtg @vivekkuchibotla @HeshamAWMusic @VishnuSarmaDOP… pic.twitter.com/lhhiQctosM
— People Media Factory (@peoplemediafcy) September 21, 2023
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!