యంగ్ హీరో నాగ శౌర్య, షిర్లీ సెటియా హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “కృష్ణ వ్రింద విహారి”. ఈ మూవీ ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. తాజాగా “కృష్ణ బృంద విహారి” టీజర్ ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్ లో లీడ్ పెయిర్ మధ్య ఘాటు రొమాన్స్, కెమిస్ట్రీని చూపించారు. నాగశౌర్య హ్యాండ్సమ్ గా, షెర్లీ అందంగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ బాగుంది. విజువల్స్ రిచ్ గా ఉండగా, డైలాగులు కూడా ఆకట్టుకుంటున్నాయి. మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై మంచి అంచనాలు పెంచేశారు మేకర్స్.
Read Also : Oscars 2022 Winners List : ఉత్తమ నటీనటులు ఎవరంటే ?