Krishna Vamsi Birthday Special :వైవిధ్యంతోనే కృష్ణవంశీ పయనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Vamsi Birthday Special:
నలుగురు నడిచే దారిలోనే మనమూ నడిస్తే అందులో గొప్పేంటి అన్నట్టుగా కొందరి భావన, ప్రవర్తన ఉంటాయి. అలాగే వారు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దర్శకుడు కృష్ణవంశీ అలాంటివారే అని చెప్పక తప్పదు. ‘థింక్ ఔటాఫ్ ద బాక్స్’ అన్న రీతిలో కృష్ణవంశీ సాగుతూ ఉంటారు. పాత కథనైనా కొత్తగా చెప్పాలని తపిస్తారు- అదే కృష్ణవంశీ ప్రత్యేకత. తన ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శించాలనే భావిస్తారు.
కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. 1962 జూలై 28న కృష్ణవంశీ జన్మించారు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ కథలు రాసుకొనేవారు కృష్ణవంశీ. సమకాలీన సమస్యలకూ తగిన పరిష్కారం చూపించాలనీ తపించేవారు. ఆయన తండ్రి ఉద్యోగరీత్యా తెలుగునేలపైని అన్ని ప్రాంతాల్లోనూ కృష్ణవంశీ కూడా తిరిగారు. తాను రాసుకొనే కథలకు అనుగుణంగా, తన అనుభవాలను వాటిలో చొప్పిస్తూ చిత్రాలను తెరకెక్కించారు కృష్ణవంశీ. అందుకే ఆయన సినిమాలు జనాన్ని ఇట్టే ఆకర్షించేవి. ఇంగ్లిష్ లిటరేచర్ లో మంచి పట్టున్న కృష్ణవంశీ చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే అందరి మన్ననలు అందుకున్నారు. కొందరికి అసోసియేట్ గా పనిచేస్తూ సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు గమనించేవారు. ఆ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ ‘శివ’ తెరకెక్కిస్తున్నారు. తన కో-డైరెక్టర్ శివనాగేశ్వరరావు ద్వారా కృష్ణవంశీ ప్రతిభ తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ ‘శివ’ కోసం వంశీని ఆహ్వానించారు. ఆ సినిమాకు రాము దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వంశీ, తరువాత ఆయన వద్దే కొనసాగారు. రామ్, అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన తెలుగు చిత్రం ‘గులాబీ’ ద్వారా కృష్ణవంశీ దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
Also Read
- Gatta Kusthi 2: "విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది".. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
- Pawan Kalyan: "ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!".. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
- Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
‘గులాబీ’ చిత్రాన్ని చూసిన నాగార్జునకు కృష్ణవంశీ టేకింగ్ పై గురి కుదిరింది. వెంటనే ఓ అవకాశం కల్పించారు. తద్వారా వెలుగు చూసిన చిత్రమే ‘నిన్నే పెళ్ళాడతా’. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అప్పటి వరకూ ఉన్న నాగార్జున సినిమాల పాత రికార్డులను తిరగరాసింది. ఒక్కసారిగా చిత్రసీమ కృష్ణవంశీవైపు తిరిగి చూసేలా చేసింది. రెండు చిత్రాల సక్సెస్ తో కృష్ణవంశీ నిర్మాతగా మారారు. ‘ఆంధ్రా టాకీస్’ అనే బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ‘సిందూరం’ తెరకెక్కించారు. ఇందులో నక్సలిజమ్ వర్సెస్ పోలీస్ అనే అంశాన్ని తీసుకొని, సహజత్వం ఉట్టిపడేలా రూపొందించారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత నాగార్జున మరో అవకాశం కల్పించారు. మళయాళ ‘చంద్రలేఖ’ ఆధారంగా అదే టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ స్థాయిలో అలరించలేకపోయింది. రాయలసీమ ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలో రూపొందించిన ‘అంతఃపురం’ విమర్శకుల ప్రశంసలతో పాటు విజయాన్నీ అందించింది. జగపతిబాబుతో రూపొందించిన ‘సముద్రం’ జనాన్ని అలరించింది. మహేశ్ బాబుతో కృష్ణవంశీ తెరకెక్కించిన ‘మురారి’ అనూహ్య విజయం సాధించింది. మరుసటి సంవత్సరం హిందీలో ‘అంతఃపురం’ చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. ‘శక్తి : ద పవర్’ పేరుతో రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచీ కృష్ణవంశీ రూపొందించిన “ఖడ్గం, డేంజర్, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం” వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో కొన్ని జనాన్ని అలరించాయి. మరికొన్ని ఫరవాలేదనిపించాయి. ఇంకొన్ని నిరాశ పరిచాయి. అయితే ‘నిన్నే పెళ్ళాడతా’ స్థాయి విజయాన్ని మాత్రం మళ్ళీ సొంతం చేసుకోలేక పోయారు కృష్ణవంశీ. అయినా, ఆయన అభిమానులు ఏదో ఒక రోజున మళ్ళీ కృష్ణవంశీ జనాన్ని మెప్పించే చిత్రం తీస్తారని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
“ఖడ్గం, చక్రం, చందమామ” చిత్రాల ద్వారా కృష్ణవంశీ ఉత్తమ దర్శకునిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. కృష్ణవంశీ చిత్రాల ద్వారా మహేశ్ బాబు, జూ.యన్టీఆర్, ప్రభాస్, కాజల్ – తమ నటనతో జనాన్ని ఆకట్టుకోగలిగారు. కృష్ణవంశీ ప్రయోగాల బాట పట్టకుండా, కమర్షియల్ ఫార్ములాతోనే సాగి ఉంటే, ఈ పాటికి మరికొన్ని సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో చేరేవనీ కొందరు అభిప్రాయపడతారు. ఏది ఏమైనా కృష్ణవంశీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘రంగమార్తాండ’తో మళ్ళీ జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం. దీని తరువాత ‘అన్నం’ అనే సినిమానూ ఆయన తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!