BRINDA: ‘కోనసీమ థగ్స్’ ట్రైలర్ లోని డైలాగ్ ఆమె గురించేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konaseema Thugs: ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ ఫస్ట్ టైమ్ మెగాఫోన్ చేతిలోకి తీసుకుని తెరకెక్కించిన సినిమా ‘హే సినామికా’. దుల్కర్ సల్మాన్, ఆదితిరావ్ హైదరి, కాజల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా గత యేడాది విడుదలైంది. తాజాగా బృందా మాస్టర్ మరోసారి పాన్ ఇండియా సినిమా మేకింగ్ సిద్ధమైంది. అదే ‘థగ్స్’. తెలుగులో ఈ సినిమాకు ‘కోనసీమ థగ్స్’ అనే పేరు పెట్టారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఇది త్వరలో విడుదల కాబోతోంది. రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్నఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, పంపిణీదారుడు శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు సమర్పిస్తూ, జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా దీనితో పరిచయం అవుతుండగా బాబీ సింహ, ఆర్.కె. సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ మధ్యన విడుదలైన ‘థగ్స్’ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో చిత్రం పై అంచనాలు రెట్టింపు చేసింది. ఇప్పుడు చిత్రబృందం ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. డిజిటల్ ట్రైలర్ ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తి సురేష్ విడుదల చేశారు. 2 నిముషాల 23 సెకన్ల నిడివి ఉన్న ‘కోనసీమ థగ్స్’ ట్రైలర్ వయొలెన్స్ తో కూడిన ఒక ఇంటెన్స్ ఫిల్మ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. ట్రైలర్ లో హ్రిదు హరూన్, బాబీ సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, అనస్వర రాజన్ పాత్రలు ఉత్కంఠ రేపేలా రివీల్ చేశారు దర్శకురాలు బృంద. హ్రిదు హరూన్, శేషు పాత్రలో రా అండ్ రస్టిక్ క్యారక్టరైజేషన్ తో చూడగానే రిజిస్టర్ అయిపోతారు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీని చాలా బాగా క్యారీ చేశారు. హ్రిదు కి నటుడిగా చాలా మంచి భవిష్యత్తు ఉండబోతోంది అని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. జైలు నుండి బయటపడేందుకు ఇందులోని వ్యక్తులు పాత్రలు వేసే ఎత్తులు అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే ప్రయత్నాలు ఉత్కంఠ భరితంగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో వచ్చే ఓ సంభాషణ ఆసక్తికరంగా ఉంది. ”ఒక్కసారి మిస్ అయ్యింది… ఇంకొక్కసారి అవదు!” అని హీరో చెబుతాడు. నిజానికి ఈ సంభాషణ బృందా గోపాల్ తన గురించి తాను చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. తొలి చిత్రం ‘హే సినామికా’ మిస్ ఫైర్ అయ్యింది… ఈ సారి అలా కాదు” అని వివరణ ఇస్తోందేమో అనిపిస్తుంది. ఏదేమైనా… ఈ ట్రైలర్ కు శామ్ సి.ఎస్. ఇచ్చిన నేపథ్య సంగీతం, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ హైలైట్ గా నిలిచాయి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?