ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీరంగంలోనూ తన సత్తా చాటుతోంది. ఈ నెల 24న రాబోతున్న 'కోనసీమ థగ్స్' మూవీని ఇదే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో పంపిణీ చేయబోతోంది.
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృంద మరోసారి పాన్ ఇండియా సినిమా మేకింగ్ సిద్ధమయ్యారు. అదే 'థగ్స్'. తెలుగులో ఈ సినిమాకు 'కోనసీమ థగ్స్' అనే పేరు పెట్టారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
'థగ్స్' చిత్రానికి సంబంధించిన క్యారక్టర్ ఇంట్రడక్షన్ వీడియోను చెన్నైలో భారీ వేడుకలో విడుదల చేశారు. ఆర్య, భాగ్యరాజ్, గౌతమ్ మీనన్, పార్థిబన్, ఖుష్బూ, దేసింగ్, పూర్ణిమ భాగ్యరాజ్, కళామాస్టర్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ వీడియోను విడుదల చేశారు.