మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రూ.1100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. ఇప్పటికీ పలు థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగిస్తూనే ఉంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు పాటలను రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా నాలుగో పాటను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులందరిని కంటతడి పెట్టించిన ‘కొమరం భీముడో’ వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట లిరికల్ వీడియో విన్నప్పుడే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చిన విషయం విదితమే.
ఇక వీడియో సాంగ్ చూస్తుంటే రక్తం మరిగిపోవడం ఖాయం. బ్రిటిష్ సైన్యం ముందు రామరాజు చేతిలో కొమురం భీమ్ దెబ్బలు తినే సమయంలో కొమరం భీమ్ పాడే ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక సుద్దాల అశోక్ తేజ రాసిన ఒక్కో పదం ఒక్కో తూటాలా పేలింది. ముఖ్యంగా కీరవాణి సంగీతం, కాళ భైరవ బేస్ వాయిస్ తో ఈ సాంగ్ ను హైలైట్ చేయగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపం అల్టిమేట్ గా నిలిచింది. ఇక మరోపక్క స్నేహితుడిని, ఉద్యోగాన్ని రెండు వదులుకోలేని నిస్సహాయ స్థితిలో రామ్ చరణ్ హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన ఈ సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.