Komali Prasad : ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎంతలా అంటే.. అది లేకుండా సినిమా కంప్లీట్ చేస్తే కుదరదు అన్నట్టు. ఈ లిప్ లాక్ గురించి మాట్లాడేందుకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కామెంట్స్ చేస్తారు. తాజాగా నటి కోమలి ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు లిప్ లాక్ ఎందుకు ఇచ్చావ్ అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్లే అని కబర్లు చెబుతున్నారు. నిజం ఏంటంటే అదో పెద్ద జోక్. ఇప్పుడు లిప్ లాక్ ను ప్రేక్షకులు కూడా చాలా కామన్ గానే తీసుకుంటున్నారు అంటూ తెలిపింది కోమలి.
Read Also : Sobhita : నేను ఇండియన్ అంకుల్ లాగా ఉంటా.. శోభిత షాకింగ్ పోస్టు
ఒకప్పటిలాగా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఈ విషయంలో నేను కూడా అంతే. నాకు కూడా లిప్ లాక్ ఇచ్చే ఛాన్స్ వస్తే ఓకే అంటాను. దాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదు. కోందరు హీరోయిన్లు మాస్ ఫాలోయింగ్ కోసం ఇలాంటి లిప్ లాక్ లు చేస్తుంటారు. కానీ నేను మాత్రం కథలో నా పాత్రకు అది అవసరం అయితేనే ఓకే అంటాను. కానీ కావాలని నేను ఇరికించేందుకు ప్రయత్నించను అంటూ తెలిపింది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన శశివదనే మూవీ అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
Read Also : Srinidhi Shetty : ప్రభాస్ మీద శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేసిందేంటి..