Thalapathy 69 Movie Cast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. లియో మూవీ తరువాత దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో GOAT (Greatest Of All Time )అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విజయ్ ఇటీవల ముగించారు. ఇది సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ దశ లో ఉండగానే విజయ్ కెవిఎన్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా కమిట్ అయ్యారు. ఇదే చివరి సినిమాగా అని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు.
Also Read:The India House: రామ్ చరణ్ నిర్మాణ సంస్థలో కార్తికేయ హీరో..?
మొదట ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు అని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు అనూహ్యంగా దర్శకుడు హెచ్ వినోద్‌తో పేరును మేకర్స్ రివీల్ చేసారు. అలానే విజయ్ సరసన హీరోయిన్ సమంత నటించబోతుంది. ఒకప్పుడు విల్లు ఇద్దరు కలిసి తేరి, మెర్సల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు మల్లి హ్యాట్రిక్ గ రాబోతున్నారు. ఈ సినిమా విజయ్ దళపతి 69 వ మూవీ గా తెరకెక్కుతుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మళ్లీ విజయ్‌తో జతకట్టనున్నారు. అక్టోబర్ నెలాఖరులో లేదా నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.