Kollywood : సీక్వెల్స్ తో సేఫ్ గేమ్ ఆడుతున్న కోలీవుడ్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ లో ఒకరిని చూసి ఒకరు సీక్వెల్ ప్రాజెక్ట్ లు స్టార్ట్ చేస్తున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా ఈసారి తంబీల సీక్వెల్స్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ హీరోలు హిట్ కొడితే చాలు అన్నట్లుగా ఉన్నారు. గతేడాది సరైన సక్సెస్ లేని హీరోలైతే తమ పాత హిట్ లకు సీక్వెల్స్ తెచ్చే పనిలో పడ్డారు. ఇంకొందరు అప్పటివరకు ఏం వెయిట్ చేస్తామని చెప్పి ఒకటి రెండు సినిమాల తర్వాత సీక్వెల్స్ షురూ చేస్తున్నారు. శివ కార్తికేయన్ నటించిన రీసెంట్ చిత్రం “అమరన్”తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read : MouniRoy : బికినీలో మౌని రాయ్.. మాములుగా లేదోయ్..
Also Read
- Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్‌వైఫ్‌గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
- AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!
- Ma Inti Bangaram OTT Update : 'మా ఇంటి బంగారం' మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
- Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
తాజాగా శివకార్తికేయన్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో ‘మదరాసి’ సినిమా ప్రకటించాడు. ఇది గతంలో మురుగదాస్ డైరెక్ట్ చేసిన తుపాకీ ఫిలింకు సీక్వెల్ అని చెన్నై వర్గాల టాక్. ఇక రజనీకాంత్ కు జైలర్ తర్వాత లాల్ సలామ్ ,వెట్టియాన్ రూపంలో రెండు ఫ్లోప్స్ పలకరించాయి. దీంతో ఎలాగైనా హిట్ ఇవ్వలని జైలర్ 2ను మొదలుపెట్టాడు. ఇక మరొక యంగ్ హీరో కార్తీ ఏకగన్ రెండు సీక్వెల్స్ ను తీసుకురానున్నాడు. ఖైదీ తర్వాత ఆ స్థాయి హిట్ ను మళ్ళీ అందుకోలేని కార్తీ దీనికి సీక్వెల్ గా ఖైదీ -2 ను తీసుకురాబోతున్నాడు. అలాగే కార్తీ మరో హిట్ సర్దార్ కు సీక్వెల్ గా సర్దార్ -2 ను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు కార్తీ. అలాగే చాలా కాలంగ హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవి మోహన్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఆయినటువంటి తనివరువన్ కు సీక్వెల్ గా తనివరువన్ 2 ను చర్చల దశలో ఉంది. ఇలా కోలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు సీక్వెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
-
KL Rahul: రాహుల్‌ను ల్యాబ్‌లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
-
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
-
Actress Rohini: రఘువరన్ నన్ను హౌస్‌వైఫ్‌గా ఉండమన్నాడు.. అందుకే సినిమాలకు దూరమయ్యాను: నటి రోహిణి
-
Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్‌లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!