బాలీవుడ్ సినిమాలపై దక్షిణాది వారి చిత్రాల దండయాత్ర కొనసాగుతుంటే ఇంటర్వ్యూలలో మాత్రం మన తారలపై ఉత్తరాది వారిదే పైచేయి అన్నట్లు ఉంది. అందుకు ఉదాహరణ కాఫీ విత్ కరణ్ టాక్ షో. ఈ షో సీజన్ 07లో ఇప్పటి వరకూ నాలుగు ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. అందులో రెండు మన తెలుగు స్టార్స్ వే. అందులో ఓ దానిలో సమంత మరో ఎపిసోడ్ లో హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఇక సమంత ఉన్న ఎపిసోడ్ లోతనతో పాటు అక్షయ్ కుమార్ ఉండగా… విజయ్ దేవరకొండతో అనన్య పాండే షూట్ లో పార్టిసిపేట్ చేశారు. వీటి ఫీడ్ బ్యాక్ విషయానికి వస్తే సమత, విజయ్ పై వారి పార్ట్ నర్స్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది.
సమంత ఎపిసోడ్ లో అమ్మడి విడాకులు, నెక్ట్స్ డేటింగ్, మాజీ భర్త నాగచైతన్య చుట్టూ తిరిగింది. వాటికి సమంత నేరుగాను, ఇండైరెక్ట్ గాను సమాధానాలు ఇచ్చింది. విజయ్ దేవరకొండ ఎపిసోడ్ సెక్స్ చుట్టూ తిరిగింది. తన పార్ట్ నర్ అనన్య పాండే కూడా వాటికి సమాధానం ఇచ్చింది. అయితే సమంత, అక్షయ్ ఎపిసోడ్‌లో అక్షయ్ కుమార్ స్పాంటేనియస్ గా, హిలేరియస్ గా ఇచ్చిన ఆన్సర్లు సమంత జోష్, క్లవర్ గా ఇచ్చిన ఆన్సర్లను డామినేట్ చేశాయని చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ ఆచితూచి ఆలోచనాత్మకంగా ఇచ్చిన సమాధానాలపై అనన్య నిజాయితీతో కూడిన సెక్స్ టాక్ అందరి దృష్టిని ఆకర్షించిందన్నది నిజం.
ఇలా ఇద్దరు సౌత్ సెలబ్రిటీలపై ఉత్తరాది తారలు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారన్నది వాస్తవం. అందుకు ఉత్తరాది తారలు తరచుగా ఇలాంటి ప్రశ్నలు పలు ఇంటర్వ్యూలలో ఫేస్ చేస్తూ ఉండటం కారణంగా చెప్పవచ్చు. మన తారలు ఇలాంటి వ్యక్తిగత ప్రశ్నలు ఫేస్ చేయటం అరుదు. ఇలాంటి వాటికి రణవీర్ సింగ్, అలియా భట్, సారా అలీ ఖాన్ అలవోకగా సమాధానాలు ఇచ్చేస్తుండటం గమనించవచ్చు. ఉత్తరాది వారికి దక్షిణాది వారికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా అదే. ఏది ఏమైనా మన దక్షిణాది తారలపై ఉత్తరాదివారి వారి ఆధిపత్యం ఇంటర్వ్యూల దగ్గర మాత్రమే. అదే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మనదే పై చేయి. ఎమంటారు!?