Kishkindhapuri OTT: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించిన ఈ చిత్రంలో నటుడు, డాన్స్ మాస్టర్ శాండీ విలన్‌గా నటించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించారు.
థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘కిష్కింధపురి’ చిత్రం జీ5 (Zee5) వేదికగా నేటి నుంచి (అక్టోబర్ 17) స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. ఓటీటీ డీల్‌ను కూడా భారీ ధరకే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ థియేటర్లలో ఈ సినిమాని చూడలేని వారు, ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు. ఓటీటీ స్ట్రీమింగ్‌తో పాటు, అక్టోబర్ 19 సాయంత్రం జీ టీవీలో కూడా ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
Gujarat: గుజరాత్లో నేడు మంత్రివర్గ విస్తరణ.. జడేజా భర్యకు ఛాన్స్..! కొత్త మంత్రులు పేర్లు ఇవే..?