యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇటివలే ‘వాసువ సుహాస’ అనే ఫస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చాలా క్లాసికల్ ట్యూన్ ఇచ్చి ‘వాసువ సుహాస’ సాంగ్ ని స్పెషల్ గా మార్చాడు. సాంగ్ స్టార్టింగ్ లో వచ్చిన ‘శుభలేఖ సుధాకర్’ డైలాగ్స్ సినిమా కథని తెలిపేలా ఉన్నాయి. ‘కనిపించే ప్రతోడు మన నైబర్’ అని శుభలేక సుధాకర్ చెప్పిన డైలాగ్ కనెక్ట్ అవ్వడంతో, సాంగ్ వినే వాళ్లకి వెంటనే రీచ్ అవుతుంది. మొత్తానికి ‘వాసువ సుహాస’ సాంగ్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా ప్రమోషన్స్ కి మంచి స్టార్ట్ ఇచ్చింది. ఈ సాంగ్ ఇచ్చిన జోష్ లో మేకర్స్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమా టీజర్ ని రిలీజ్ చెయ్యనున్నారు. జనవరి 9న ఉదయం 10:15 నిమిషాలకి వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సంధర్భంగా కిరణ్ అబ్బవరం ఫాన్స్ కి స్పెషల్ కాంటెస్ట్ పెట్టారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కిందో గెస్ చేసి చెప్తే, టీజర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గీతా ఆర్ట్స్ అఫీషియల్ ఇన్స్టా పేజ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కింద కామెంట్స్ సెక్షన్స్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఏ జోనర్ లో రూపొందింది అనేది గెస్ చేసి కామెంట్ చెయ్యాలి. కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్లు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్ ని రిలీజ్ చేస్తారు.
Read Also: Project K: అసలు ఎలాంటి సినిమా చేస్తున్నావ్ బ్రదరూ…
ఇదిలా ఉంటే హీరో కిరణ్ అబ్బవరంకి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. 2022లో కిరణ్ అబ్బవరం మూడు సినిమాల్లో నటించాడు కానీ ఒక్కటి కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. లాస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు పోయిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం తన మార్కెట్ కాపాడుకోవాలి అంటే ‘వినరో భాగ్యమి విష్ణు కథ’ సినిమాతో పక్కా హిట్ కొట్టాల్సిందే. లేదంటే అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులు కిరణ్ అబ్బవరాన్ని ఆడియన్స్ మరిచిపోయే ప్రమాదం ఉంది.
Guess the genre, & you will be releasing the official teaser ✨
Drop your comments on below link 👇https://t.co/pmKEMeROM9#VBVKTeaser on Jan 9th @ 10:15 AM#VinaroBhagyamuVishnuKatha ✨ #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram
A @chaitanmusic @kashmira_9 @KishoreAbburu pic.twitter.com/B1CBrfp1CY
— GA2 Pictures (@GA2Official) January 5, 2023