వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం ఎ. ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్న ‘రూల్స్ రంజన్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. ఎం. రత్నం తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు మాస్ సినిమాలే ఎక్కువగా చేసిన కిరణ్ అబ్బవరం, మొదటిసారి కాస్త క్లాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఉన్నాడు. గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ రూల్స్ రంజన్ సినిమాకి మంచి బజ్ ని జనరేట్ చేసింది. సలార్ వాయిదా పడడంతో సెప్టెంబర్ 28న రూల్స్ రంజన్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
Read Also: S. J. Suryah : మహేష్ బాబుకు బాకీ పడ్డాను.. త్వరలోనే ఆ బాకీ తీర్చేస్తా..
ప్రమోషన్స్ కూడా ఈ రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసే జరిగాయి, అయితే ఒక్కసారిగా రూల్స్ రంజన్ సినిమాని వారం వెనక్కి పుష్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. సెప్టెంబర్ 28న స్కంద, చంద్రముఖి 2 సినిమాలు రిలీజ్ అవుతుండడంతో… రూల్స్ రంజన్ సినిమాని వాయిదా వేశారు. నిజానికి స్కంద సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కావాల్సి ఉంది, సలార్ డిలే కారణంగా సెప్టెంబర్ 28కి స్కంద షెడ్యూల్ చేసారు. స్కంద పాన్ ఇండియా సినిమా, చంద్రముఖి 2 సౌత్ లోని అన్ని లాంగ్వేజస్ లో రిలీజ్ అవుతుంది. మల్టీలాంగ్వేజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు రూల్స్ రంజన్ సినిమాకి థియేటర్స్ విషయంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగానే రూల్స్ రంజన్ అక్టోబర్ 6కి పోస్ట్ పోన్ అయ్యింది.