యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘రూల్స్ రంజన్’ థియేటర్స్ లోకి వచ్చేసింది. ‘సమ్మోహణుడా’ సాంగ్ తో సాలిడ్ బజ్ జనరేట్ చేసిన ఈ మూవీపై హిట్ హోప్స్ పెట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. మొదటి రోజు మార్నింగ్ షోస్ దాదాపు అన్ని సెంటర్స్ లో పడి, సోషల్ మీడియాలో డివైడ్ టాక్, కాస్త నెగటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా ఎలా ఉంది అనే విషయంలో డిటైల్డ్ రివ్యూ పోస్ట్ చేసే ముందు… సోషల్ మీడియాలో రూల్స్ రంజన్ గురించి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా కిరణ్ అబ్బవరంకి బ్యాడ్ రిజల్ట్ ని ఇచ్చినట్లు ఉంది. దీంతో సీమ నుంచి వచ్చి యంగ్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో నెగటివ్ ఫిల్మ్ పడినట్లు ఉంది. SR కళ్యాణమండపం సినిమాతో మరో మంచి హిట్ ని కొట్టి ఇండస్ట్రీలో తన ప్లేస్ లో పక్కాగా సెట్ చేసుకున్న ఈ యంగ్ హీరో, ఆ తర్వాత ఆశించిన స్థాయి హిట్స్ ఇవ్వలేదు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది మాత్రం కిరణ్ అబ్బవరంకి అందని ద్రాక్షాగానే ఉంది. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోని, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లు అయితే చేస్తున్నాడు కానీ కథల విషయంలో కిరణ్ అబ్బవరం క్లారిటీ మిస్ అవుతున్నాడు అనే కామెంట్స్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరో రెండు ఫ్లాప్స్ పడితే కిరణ్ అబ్బవరం కెరీర్ కష్టం అనుకుంటున్న సమయంలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో కిరణ్ హిట్ ట్రాక్ ఎక్కాడు కానీ దాన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయాడు. ఏడాది సమయం ఇవ్వండి మీరు గర్వపడేలాంటి సినిమాలు చేస్తాను అని చెప్పిన కిరణ్ అబ్బవరం, ఈ ఏడాది గ్యాప్ తీసుకోని సాలిడ్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది… లేదంటే మార్కెట్ పూర్తిగా దెబ్బ తిన్న తర్వాత మంచి సినిమా చేసినా ఉపయోగం లేకుండా పోతుంది.