King of Kotha Teaser: ‘సీతారామం’ హీరో నట విశ్వరూపం.. కెజిఎఫ్ రేంజ్ లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
King of Kotha Teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో లెఫ్టినెంట్ రామ్ గా నిలిచిపోయాడు. ఈ సినిమా దుల్కర్ కు ఎంతటి విజయాన్ని ఇచ్చిందో అందరికి తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత అదే రేంజ్ లో దుల్కర్ రాబోతున్నాడు. సీతారామం లో ఎంత క్లాస్ గా కనిపించాడో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోథా. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ తన సొంత బ్యానర్ వేఫేరీయర్, జీ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు. టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మాఫియా కింగ్ ఆఫ్ కోథాకు నాయకుడిగా దుల్కర్ కనిపించాడు.
NTR Fan Shyam Death: మా అన్న చనిపోయేంత పిరికివాడు కాదు.. కంటతడి పెట్టిస్తున్న శ్యామ్ చెల్లి మాటలు
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
- Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
- ‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
” రాజు గారి రక కోసం ప్రజలు వేచి ఉన్నారు. వారి ప్రజలను చంపి తిన్న ఆ రాక్షసుడు నుంచి ఈ దేశాన్ని రక్షించడం రాజుగారి వల్లే వీలు అవుతుందని వాళ్ళు నమ్మారు. ఆఖరికి ఆ రోజు వచ్చేసింది. రాజుగారు తిరిగి వచ్చేశారు ” అని ఐశ్వర్య లక్ష్మీ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమయ్యింది. కోథా అనే గ్రామంలో విలన్స్ చేతిలో బానిసలుగా పడి ఉన్న ప్రజలను కాపాడడానికి రాజుగా కింగ్ ఆఫ్ కోథా గా దుల్కర్ అడుగుపెట్టాడు. టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశాడు డైరెక్టర్. “ఇది గాంధీ గ్రామం కాదు.. కోథా రా..ఇక్కడ నేనన్నప్పుడే పగలు, నేనన్నప్పుడే రాత్రి” అని దుల్కర్ చెప్పే డైలాగ్ అయితే టీజర్ కే హైలైట్ గా నిలిచింది. మాఫియా లీడర్ గా దుల్కర్ నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా దుల్కర్ ఫేస్ ను రివీల్ చేసే షాట్స్ అయితే అదిరిపోయాయి. చివర్లో రక్తం తో తడిసిన ముఖం, చేతిలో కత్తితో దుల్కర్ విలన్స్ ను వేటాడుతున్న సీన్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు. ఇక జేక్స్ బిజోయ్ సంగీతం ఆకట్టుకొంటుంది. ఈ చిత్రంలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వైబ్ చూస్తుంటే కెజిఎఫ్ గుర్తుకు రాక మానదు. మరి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా దుల్కర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలనుంటే ఆగస్టు వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్‌లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్‌పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..