King Of Kotha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు దుల్కర్. ఈ సినిమాల తర్వాత దుల్కర్ నటిస్తున్న తాజా చిత్రం కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వంలో వేఫేరర్ ఫిల్మ్స్ మరియు జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 ఓనమ్ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్.. గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. హల్లా మచ్చారే అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో దుల్కర్ సరసన రితికా సింగ్ ఆడిపాడింది.
Urvashi Rautela: ఏపీ సీఎం పవన్ తో నటించడం ఆనందంగా ఉందా.. ఏమన్నావో అర్ధమవుతుందా.. ?
పక్కా ఊర మాస్ సాంగ్ లా కనిపిస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సాంగ్ ఏకకాలంలో రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ సాంగ్ కు తెలుగులో కెకె లిరిక్స్ అందించగా.. రేవంత్, సింధూజ శ్రీనివాసన్ ఆలపించారు. ఈ సాంగ్ లో దుల్కర్ మాస్ స్టెప్స్ తో దుమ్ము రేపినట్లు కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కోతా సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో ఇప్పటికే దుల్కర్ ఒక ట్రెండ్ సెట్ చేయడంతో .. ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి హాయ్ ను అందుకుంటాడో చూడాలి.