బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, సౌత్ సెన్సేషన్ అట్లీతో కలిసి జవాన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రీమియర్స్ మొదలనున్న ఈ మూవీ మేనియా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యింది. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్ టీమ్… రీసెంట్ గా ట్రైలర్ తో జవాన్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని ఆకాశం తాకేలా చేసారు. వెయ్యి కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా రికార్డులని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఈజీగా బ్రేక్ చేస్తాడనే కాన్ఫిడెన్స్ షారుఖ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని మరింత పెంచింది జైలర్ ట్రైలర్. ట్రైలర్ తర్వాత జవాన్ సినిమా బుకింగ్ లో స్పైక్ అమాంతం పెరిగింది. రిలీజ్ కి ఇంకా 48 గంటల సమయం ఉండగానే అన్నీ మల్టీప్లెక్స్ లో కలిపి ఇప్పటివరకూ 2,50,000 వేల టికెట్స్ బుక్ అయ్యాయి. ఇది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఈ బుకింగ్స్ కేవలం మల్టీప్లెక్స్ లకి సంబంధించింది మాత్రమే సింగల్ స్క్రీన్ బుకింగ్స్ కూడా నార్త్ లో ఫైర్ మోడ్ లో ఉన్నాయి.
బుకింగ్స్ ట్రెండ్ ని బట్టి చూస్తే జవాన్ సినిమా మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది. పఠాన్ సినిమాతో డే 1 వంద కోట్లు రాబట్టిన షారుఖ్ ఖాన్, ఇప్పుడు జవాన్ సినిమాతో ఒకే ఏడాదిలో రెండు సార్లు వంద కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేయనున్నాడు. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం వరకూ షారుఖ్ అనే పేరుకి కూడా ఇండస్ట్రీలో టైమ్ అయిపొయింది అనే మాటలు వినిపించాయి. ఇప్పుడు చూస్తే అతని టైమ్ ఎప్పటికీ అయిపోదు, అతను ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపించే రేంజులో జవాన్ సినిమా హల్చల్ చేస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో జవాన్ దాదాపు వారం రోజుల పాటు హౌజ్ ఫుల్ బోర్డ్ చూడనుంది.