Kiara Advani: గూగుల్ టాప్ సెర్చ్.. ఈ ముద్దు గుమ్మ పేరే ఫస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiara Advani: ఇంకో పది రోజుల్లో డిసెంబర్ ఎండ్ కు వచ్చేస్తోంది. ఈ ఏడాది .. అరెరే ఏంటి అప్పుడే అయిపోయింది అని అనిపించకమానదు. ఇక ఈ ఏడాదిలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ఎంతోమంది కొత్తవారు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఏడాది మొత్తంలో ప్రేక్షకులు తమ అభిమాన తారలు గురించి ఎన్నో విషయాలపై గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది ఆ గూగుల్ సెర్చ్ లో ఎవరు టాప్ ఉన్నారు అంటే.. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ టాప్ లో ఉంది. ఈ చిన్నదాని గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా వెతికారు. ముఖ్యంగా ఆమె పెళ్లి గురించి.. సినిమాల గురించి ఎక్కువ సెర్చ్ చేశారు. ఇక ఈ టాప్ లో కియారా ఒక్కత్తే ఉండడం విశేషం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ హీరోయిన్లను కాకుండా కియారా అద్వానీ గురించి నెటిజన్లు సర్చ్ చేశారనే వార్త ఆమె అభిమానులను ఆనందంలో ముంచేసింది.
కియారాకు ఇలాంటి ఘనత దక్కడంపై బాలీవుడ్ వర్గాలు కూడా ప్రశంసిస్తున్నారు. ఇటీవల కాలంలో బలమైన పాత్రలతో కియారా ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె తరువాత టాప్-10లో ఏకంగా ఆరుగురు క్రికెటర్లు ఉండగా.. టీమిండియాకు చెందిన వారు ముగ్గురు ఉండడం విశేషం.. వారిలో శుభమన్ గిల్ రెండో స్థానంలో ఉండగా, మొహమ్మద్ షమీ నాలుగో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ తొమ్మిదో ప్లేస్‌లో ఉండగా.. న్యూజిలాండ్ నయా సెన్సేషన్ రచిన్ రవీంద్ర మూడో స్థానంలో, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఏడులో, వరల్డ్‌కప్ ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ పదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సెర్చ్ లిస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!