Khushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో విజయ్, సామ్ వరుస ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకోపక్క మేకర్స్ .. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన సాంగ్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా ఖుషీ నుంచి 5 వ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భార్య మీద ఉన్న ఫ్రస్టేషన్ ను భర్త పబ్ లో తాగి పాడుతున్నట్లు తెలుస్తోంది.
Veena Srivani: వేణుస్వామి భార్య ట్యాలెంట్ ను చూశారా.. మతిపోవాల్సిందంతే
ట్రైలర్ లో చూపించిది మొత్తం పాటలో చెప్పేశారు. కాశ్మీర్ లో ఆరాధ్యను కలవడం, ప్రేమించడం, ఇంట్లో వారిని ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకోవడం.. ఇక ఆ తరువాత ఆమె మారిపోయిందని విప్లవ్ తన బాధను చెప్పుకొచ్చాడు. పెళ్లి అయ్యాక పెళ్ళాలు దెయ్యాలుగా మారతారని, ఫ్రెండ్స్ ను కలవనివ్వరని, ఫ్రీడమ్ లేకుండా చేస్తారని.. జీవితం నరకంగా మారిందని పాడుకొచ్చాడు. ఇవన్నీ బయట ప్రతి పెళ్లైన మగాడు అనుభవించే బాధలే. అందుకే ఈ సాంగ్ .. చాలా త్వరగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈ సాంగ్ లిరిక్స్ డైరెక్టర్ శివ నిర్వాణ రాయడం విశేషం. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక లిరిక్స్ విన్న అభిమానులు డైరెక్టర్ నిజ జీవిత అనుభవల్లా ఉన్నాయే ఇవన్నీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో విజయ్, సామ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.