మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ – ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఫిబ్రవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నట్లు చూపించారు. ఒకరు మనీ మైండేడ్ గా ఉంటె మరొకరు ఫన్నీ గా కనిపించాడు. పేకాటలో వచ్చే వందల కోట్ల డబ్బులను కాజేసి ఒక హీరో జైలుకు వెళ్తాడు. ఆ డబ్బును రాబట్టడానికి పోలీస్ ఆఫీసర్ అర్జున్ ప్రయత్నిస్తుంటాడు. మరోపక్క ఆ డబ్బు కోసం మాఫియా తిరుగుతూ ఉంటుంది. ఇక మధ్యలో ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్, యాక్షన్ ఛేజ్ లు, ఒక పాపను ప్రధానంగా చూపించి ట్విస్ట్ క్రియేట్ చేశారు. ఇక ఈ రెండు పాత్రలు ఎవరు.. ఎక్కడ కలుస్తారు..? ఆ డబ్బు ఏమైంది..? ఆ పాపకు హీరోకు సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక రెండు పాత్రల్లో మాస్ మహారాజా ఎనర్జీ అదిరిపోయింది. డింపుల్ , మీనాక్షి అందాలు, లిప్ లాక్ లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉన్ని ముకుందన్ ,అనసూయ ముఖేష్ రుషి వెన్నెల కిషోర్ , రావు రమేష్ లా కామెడీ హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఇక ముఖయంగా దేవి శ్రీ ప్రసాద సంగీతం ఆకట్టుకొంటుంది. మొత్తానికి ఖిలాడీ గేమ్ ని చాలా స్మార్ట్ గా ఆడినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించినట్లు ఈ యాక్షన్ పాకెడ్ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మరి ఈ సినిమాతో మాస్ మహారాజా మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.