బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో ‘ఖిలాడీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోహీరోయిన్లతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, దింపుల్ హయతి హీరోయిన్లుగా ‘ఖిలాడీ’ తెరకెక్కింది. అయితే ‘ఖిలాడీ’ ప్రీ రిలీజ్ వేదికపైనే అందరిముందూ హీరోయిన్ మీనాక్షి చౌదరికి దర్శకుడు రమేష్ వర్మ సారీ చెప్పారు. ఎందుకంటే… ‘ఖిలాడీ’ ట్రైలర్ లోనూ ఇతర ప్రమోషన్లలోనూ డింపుల్ హయతిని మాత్రమే ఎక్కువగా చూపించారు. రమేష్ వర్మ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలా జరిగినందుకు మీనాక్షికి సారీ చెప్పారు. ఇక సినిమాలో ఇద్దరి పాత్రకూ సమాన ప్రాధాన్యత ఉందని వెల్లడించారు. అంతేకాదు సినిమా చూశాక మీనాక్షి చౌదరి కూడా సంతోషిస్తుందని అన్నారు. దానికి మీనాక్షి కూడా చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చింది. ఇక ‘ఖిలాడీ’ ఫిబ్రవరి 11న థియేటర్లలో సందడి చేయనుంది.
Read Also : Anasuya : ఫుల్ కిక్ ఇస్తా… సీక్రెట్ రివీల్ చేసిన యాంకర్