KH234: సాధారణంగా ఒక హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే ప్రేక్షకుల చూపు మొత్తం దానిమీదనే ఉంటుంది. అలాంటింది.. 36 ఏళ్ళ తరువాత ఆ హిట్ కాంబో రిపీట్ అవుతుంది అంటే.. వేరే లెవెల్ అని చెప్పాలి. లోక నాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో 1987 లో నాయకన్ అనే సినిమా వచ్చింది. తెలుగులో నాయకుడు అనే పేరుతో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత దాదాపు 36 ఏళ్లు ఈ కాంబో రిపీట్ అయ్యింది. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం KH234. విక్రమ్ సినిమా తరువాత జోరు పెంచిన కమల్.. ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక ఈ సినిమాను కూడా కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మద్రాస్ టాకీస్ & రెడ్ జెయింట్ మూవీస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.
Animal: యానిమల్ వేట.. రష్మిక బలి అయ్యిందా.. ?
నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ పూజా కార్యక్రమం వేడుకలో కమల్ లుక్ మాత్రం అభిమానులు తెగ ఆకర్షిస్తుంది. అప్పటికి ఇప్పటికి వయస్సు పెరిగిందే కానీ, కమల్ లో ఉన్న నాయకన్ ఇంకా అలాగే ఉన్నట్లు కనిపిస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని టక్ తో నాయకుడును మరోసారి గుర్తుచేశాడు. మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, కమల్ తో ఇన్నేళ్ల తరువాత మరో సినిమా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.