KGF Chapter 2 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా నెల రోజుల టైం ఉండడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి “తూఫాన్” అనే పాటను మార్చి 21న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న KGF Chapter 2 చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. ఇక తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను విడుదల చేసింది టీం. అదేంటంటే… ఏప్రిల్ 13న యూఎస్ఏలో KGF Chapter 2 ప్రీమియర్లు ప్రదర్శితం కానున్నాయి అంటూ యష్ అభిమానులకు సూపర్ అప్డేట్ ఇచ్చింది.
Read Also : RRR Dubai Press Meet : రాజమౌళితో చనువుగా ఉండటం మైనస్… ఎన్టీఆర్ కామెంట్స్
నార్త్ అమెరికాలో ఈ సినిమాను సరిగమ సినిమాస్, సినిస్థాన్ ఫిలిం కో, ఏఏ ఫిలిమ్స్ ఇండియా విడుదల చేయనున్నట్లు ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF Chapter 2 విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. KGF Chapter 1 చిత్రం విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. KGF Chapter 2లో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.