The Kerala Story: హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ, అమ్మడికి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే రావడంతో ఆదా బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోల సరసన నటిస్తూనే అడపాదడపా కోలీవుడ్, టాలీవుడ్ లలో కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఆదా నటిస్తున్న కొత్త చిత్రం ది కేరళ స్టోరీ. సుదీప్తో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
కేరళలో కిడ్నప్ కు గురైన 32 వేల మంది అమ్మాయిలను బలవంతంగా టెర్రరిస్టులు వారి మతంలోకి లాగి, వారిపై టెర్రరిస్టులు అనే ముద్ర వేసి, ఎలా చిత్ర హింసలకు గురిచేశారు అనేదాన్ని హృద్యంగా చూపించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆదా.. షాలిని ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తోంది. షాలిని నుంచి ఐఎస్ఐ టెర్రరిస్టు ఫాతిమా గా ఆమె ఎలా మారింది. నర్సు కావాలని కలలు కన్న ఆమె టెర్రరిస్టుల చేతికి ఎలా చిక్కింది. అక్కడ జరిగిన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది అనేది టీజర్ లో ఆదా కన్నీటి తో చెప్తుంటే చూసేవారికి సైతం కన్నీళ్లు రాక మానదు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://youtu.be/udoCRDjqxv8