ట్యాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటి కీర్తి సురేష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక సందర్భంగా ఆమెకు ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. తాజాగా ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. డెనిమ్ జాకెట్, రంగు రంగుల టాప్ ధరించిన కీర్తి చూడడానికి చాలా అందంగా, స్టైలిష్ గా ఉంది. యంగ్ బ్యూటీ కీర్తి తాజా పోస్టర్ వైరల్ అవుతోంది.
Read Also : ‘మా’ వివాదంలో కొత్త కోణం… రంగంలోకి పోలీసులు
‘సర్కారు వారి పాట’లో కీర్తి కళావతి అనే యువతి పాత్రను పోషిస్తుంది. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టులో కళావతిని స్వయంగా పరిచయం చేశాడు. ఇక మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించడం ఇదే మొదటిసారి. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చాలా ఫ్రెష్ గా ఉంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీత స్వరకర్త. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.