Keerthy Suresh: ప్లాప్స్ పరంపరకు కీర్తి సురేష్ చెక్ పెట్టేనా?.. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఊపిరిపోస్తుందా?
- మరో లేడీ ఓరియెంట్ సినిమాలో కీర్తి సురేష్
- నవంబర్ 28న వస్తున్న రివాల్వర్ రీటా
- క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఫిల్మ్
- మామనన్ తర్వాత హిట్ చూడని భామ
- ప్లాప్స్ పరంపరకు కీర్తి సురేష్ చెక్ పెట్టేనా..?
- ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఊపిరిపోస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది లేడీ ఓరియెంట్ చిత్రాలు హీరోయిన్లకు పెద్దగా అచ్చిరాలేదు. అనుష్క, తమన్నాలకు ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు ఇమేజ్ డ్యామేజ్ చేస్తే.. రష్మిక ఓకే అనిపించుకుంది. మరీ మలయాళ కుట్టీ కీర్తి సురేష్ సంగతేంటీ?. పలుమార్లు చేతులు కాల్చుకున్నా.. కూడా ఉమెన్ ఓరియెంట్ చిత్రాలు చేయడం మానదా?.
టాలీవుడ్‌లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు ఆదరణ తగ్గింది. అయినా తమ ప్రయత్నాలు ఆపలేదు కొంత మంది బ్యూటీస్. సీనియర్ భామలు అనుష్క ఘాటీతో వస్తే.. ఆడియన్స్ తిప్పికొట్టారు. తమన్నా ఓదెల-2లో పూర్తిగా మారిపోయి డివోషనల్ టచ్ ఇచ్చినా చూడలేదు. కాస్తో కూస్తో బెటర్ అనిపించింది రష్మిక. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యిందని సమాచారం. ఇక నెక్ట్స్ ఫ్రూవ్ చేసుకోవాల్సింది కీర్తి సురేష్ వంతు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
మహానటి తర్వాత లేడీ ఓరియెంట్ చిత్రాలు చేసి చేతులు కాల్చుకుంది మలయాళ కుట్టీ కీర్తి సురేష్. కరోనా ఎఫెక్ట్ వల్ల పెంగ్విన్ ఓటీటీలోకి వచ్చేసింది కానీ.. థియేటర్లలోకి వచ్చి ఉంటే కచ్చితంగా ప్లాప్ అయ్యి ఉండేదన్న టాక్ వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చిత్రాలతో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు ఊపిరిపోద్దామని ట్రై చేసింది కానీ.. కంటెంట్ లేకపోయే సరికి బాక్సాఫీస్ దగ్గర బొమ్మలు బోల్తా పడ్డాయి. అయినా సరే మరోసారి ప్రయోగానికి రెడీ అయ్యింది.
Also Read: IND vs SA: 408 పరుగుల తేడాతో భారత్ ఓటమి.. సిరీస్ వైట్‌వాష్!
‘రివాల్వర్ రీటా’తో లేడీ ఓరియెంట్ చిత్రాలకు లైఫ్ ఇవ్వడంతో పాటు మామన్నన్ తర్వాత చూడని హిట్ కోసం కీర్తి ట్రై చేస్తుంది. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు కీర్తి దీనితో ఆపేస్తుంది అనుకుంటే పొరపాటు. అక్క అనే వెబ్ సిరీస్, తమిళంలో చేస్తున్న కన్నివీడి, తెలుగులో కమిటైనట్లుగా చెబుతున్న ఎల్లమ్మ కూడా ఈ కోవలోనిదేనని టాక్. రౌడీ జనార్థనాలో విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కీర్తి.. రివాల్వర్ రీటాతో తన ఫ్లాప్స్ పరంపరకు బ్రేకులేస్తుందేమో?, ఫీమేల్ ఓరియెంట్ చిత్రాలకు ఊపిరిపోస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..