Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celebrity Marriage: సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్ల మధ్య ఏర్పడే పరిచయాలు కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాల్లోనూ ప్రత్యేకమైన బంధాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులతో వేర్వేరు సందర్భాల్లో పరిచయం ఏర్పడటం, వారిలో ఒకరితో సినిమాల్లో నటించిన హీరోయిన్.. మరొకరిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా జాబితాలోకి టాలీవుడ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్ చేరడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కావ్య కళ్యాణ్‌రామ్.. హీరో శ్రీ సింహా కోడూరితో కలిసి ‘ఉస్తాద్’ సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి వెండి తెరపై సందడి చేశారు. అయితే ఇప్పుడు కావ్య.. శ్రీ సింహా అన్న, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పెద్ద కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ‘తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడుతున్న హీరోయిన్’ అంటూ కావ్య పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి సంఘటనలు సినీ పరిశ్రమలో ఇదే తొలిసారి కాదని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. గతంలో అతిలోక సుందరి శ్రీదేవి విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన బంధం ఏర్పడిందని చెబుతున్నారు. శ్రీదేవి.. నటుడు అనిల్ కపూర్‌తో కలిసి పలు సినిమాల్లో నటించారు. అనంతరం అనిల్ కపూర్ సోదరుడు, నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అప్పట్లో బాలీవుడ్లో సంచలనంగా మారింది. ఇదే తరహాలో నటి శ్రియా రెడ్డిని కూడా హీరో విశాల్‌తో కలిసి సినిమాల్లో నటించారు. అనంతరం విశాల్ సోదరుడు, నిర్మాత విక్రమ్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ జాబితాలో కావ్య కళ్యాణ్‌రామ్ పేరు తెరపైకి వచ్చిన సందర్భంగా ‘ఇలా తమ్ముడితో లేదా అన్నతో నటించి.. అదే కుటుంబంలోని మరో వ్యక్తిని వివాహం చేసుకున్న హీరోయిన్లు ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Also Read
- Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
-
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
-
Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
-
Story Board: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది..?
-
Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!